కృష్ణ

నాగరికత వికాసానికి పునాది భాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 25: నాగరికత వికాసానికి భాష పునాది అని జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు. స్థానిక బచ్చుపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలోని మహతి లలిత కళావేదికపై నిర్వహిస్తున్న నెల నెలా వెన్నల తృతీయ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త డా. బృందావనం ధన్వంతరి ఆచార్య రచించిన అనుకరణ, న్యాయం.. అంటే కథా సంపుటిలను ఆవిష్కరించారు. అనుకరణ పుస్తకాన్ని డా. గుమ్మా సాంబ శివరావు ఆవిష్కరించగా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి డా. జివి పూర్ణచంద్ సమీక్షించారు. న్యాయం అంటే పుస్తకాన్ని సాహిత్య విమర్శకుడు డా. మాదిరాజు రామలింగేశ్వరరావు ఆవిష్కరించగా డా. గుమ్మా సాంబశివరావు సమీక్షించారు. అనంతరం జరిగిన ఉగాది కవి సమ్మేళనంలో కారుమూరి రాజేంద్ర ప్రసాద్, మడమల రాంబాబు భాగవతార్, బి పుల్లారావు, డి దత్తాత్రేయ శర్మ, ఎ పోతరాజు, కెకెడి మహాలక్ష్మి, కె భవాని, జె చంద్రిక, జొన్నలగడ్డ ఝాన్సీ కవితలను వినిపించారు. డా. మాదిరాజు రామలింగేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డా. ఆకెళ్ల రామకృష్ణమూర్తి, భవిష్య, మల్లంపల్లి నాగ లింగ శాస్ర్తీ, ముత్తేవి రామకృష్ణ, వేమూరి పూర్ణచంద్రరావు, పసుమర్తి కేశవ ప్రసాద్, స్వర్ణరాజ హనుమంతరావు, కొట్టె రామారావు, గుడిపూడి రాధికారాణి తదితరులు పాల్గొన్నారు.
నవయుగ సమాఖ్య ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 25: స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని నవయుగ సమాఖ్య (ఎన్‌వైఎస్) పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించింది. బస్టాండ్ సెంటరు నుండి కోనేరుసెంటరు వరకు ఈ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌వైఎస్ నాయకుడు వస్త్రాల హనుమంతు మాట్లాడుతూ భగత్‌సింగ్‌లో పెరుగుతున్న సామ్యవాద చైతన్యాన్ని చూసి సహించలేక బ్రిటీష్ సామ్రాజ్యవాదులు ఆయన్ని, అతని సహచరులు రాజగురు, సుఖదేవ్‌లను ఉరి తీశారన్నారు. నేడు నిరుద్యోగాన్ని, సామ్రాజ్యవాద దోపిడీ సంస్కృతిని పెంచిపోషిస్తున్న పాలకుల విధానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్‌టియు నాయకుడు ముచ్చు సుధాకరరావు, రైతుకూలీ సంఘం నాయకుడు ఈపూరి రాంబాబు, కరుణామయుడు, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.

పరిశోధనాత్మక విద్య ఎంతో మేలు

నూజివీడు, మార్చి 25: పరిశోధనాత్మక విద్య ఎంతో మేలు చేస్తుందని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు ఆచార్యులు పేర్నొన్నారు. సాంకేతిక విద్యతో పాటు రసాయన విద్య, పరిశోధన విద్యపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం నూజివీడు ట్రిపుల్ ఐటీలో శనివారం డిపార్టుమెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ సింపోజియం నిర్వహించారు. మద్రాస్ ఐఐటి ఆచార్యులు ఎం చిదంబరం, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వీరంకి వెంకటదాసు మాట్లాడుతూ కెమికల్ ఇంజనీరింగ్‌లో విద్యార్ధులు అనుసరించాల్సిన పద్ధతులు వివరించారు. ప్రతి విద్యార్థి టైమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు సెల్ఫ్ లెర్నింగ్‌పై కూడా దృష్టి సారించాలని చెప్పారు. పరిశోధనాత్మక విద్య ఎంతో మేలు చేస్తుందని అన్నారు. కాకినాడ ఒఎన్‌జిసి ప్రతినిధి ఎం సత్యాలాల్ ఒఎన్‌జిసి పనితీరు వివరించారు. పలువురు విద్యార్థులు పేపర్ ప్రజంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ ప్రాంతీయ కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు, మైథిలీ, ఎం రామకృష్ణ, సింపోజియం కన్వీనర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.