కృష్ణ

మట్టిలో మాణిక్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మార్చి 25: ఇటీవల నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఎంపిక పరీక్షల్లో దివిసీమకు చెందిన ఇద్దరు మహిళలు ఎంపికయ్యారు. అతి సామాన్య రైతు కుటుంబానికి చెందిన వీరిరువురూ తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ పోస్టులకు అర్హత సాధించి దివిసీమకే గర్వకారణంగా నిలిచారు. మండల పరిధిలోని మోదుమూడి గ్రామానికి చెందిన మత్తి వెంకట రేవతి, మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామానికి చెందిన నాగ వౌనికలను ఎస్‌ఐ పోస్టులు వరించాయి. రేవతి మోదుమూడిలోని వ్యవసాయ కూలీ మత్తి వెంకటేశ్వరరావు కుమార్తె. అదే గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 7వ తరగతి వరకు, తరువాత అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూల్‌లో పదవ తరగతి, ఎస్‌విఎల్ క్రాంతి కళాశాలలో బిఎస్‌సి కంప్యూటర్స్ విద్య నభ్యసించింది. అలాగే నాగ వౌనిక కూడా వ్యవసాయ కూలీ కుటుంబం నుండే వచ్చింది. ఆమె తండ్రి వెంకట సత్యనారాయణ వ్యవసాయ కూలీగా జీవిస్తూ తన కుమార్తె వౌనికను చదివించారు. ఆమె కూడా ఎస్‌విఎల్ క్రాంతి కళాశాలలో ఇంటర్మీడియట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. జోన్-2 పరీక్షలో నాల్గవ ర్యాంక్ సాధించారు. వీరిరువురిని శివాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోలీసు డైరెక్టర్ ఆది అశోక్ అభినందించారు.