కృష్ణ

ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మహిళల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మార్చి 25: గుడివాడ ఎక్సైజ్ సీఐ కార్యాలయం ఎదుట గుడ్లవల్లేరు మండలం సింగలూరు గ్రామానికి చెందిన మహిళలు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గ్రామంలోని నివాసాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేయడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. కుటుంబ యజమానులు పనులకు వెళ్ళకుండా మద్యం షాపుల్లోనే గడుపుతున్నారని, వెంటనే మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ సీఐ, గుడివాడ ఆర్డీవో కార్యాలయాల్లో వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు వి నాగమోహిని, కొడాలి లక్ష్మి, ఆకురాతి ఆదిలక్ష్మి, సిహెచ్ నాగలక్ష్మి, నందం శ్రీనివాసరావు, ఆకురాతి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
మంచినీటి ఎద్దడి నివారణకు ఆర్‌ఓ ప్లాంట్ యాజమాన్యాలు సహకరించాలి
పెడన, మార్చి 25: పట్టణ ప్రజలకు వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా తీసుకుంటున్న చర్యలకు పట్టణంలోని ప్రైవేట్ ఆర్‌ఓ ప్లాంట్‌ల యజమానులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మనె్నం గోపాలరావు కోరారు. వేసవి నేపథ్యంలో మంచినీటి ఎద్దడిని పరిష్కరించేందుకు శనివారం పట్టణంలోని ఆర్‌ఓ ప్లాంట్ యజమానులు, కౌన్సిలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కూపన్ల ద్వారా ప్రజలకు ఆర్‌ఓ మంచినీటిని అందించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరంలో 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను రూ.7లకు అందించగా ఈ సంవత్సరం ఒక రూపాయి పెంచి రూ.8లకు అందించనున్నట్లు తెలిపారు. దీనిపై ఆర్‌ఓ ప్లాంట్ యాజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తాము నష్టపోయామని, కనీసం రూ.10లు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్, కౌన్సిలర్లు కటకం ప్రసాద్, మెట్ల గోపీప్రసాద్, గరికముక్కు చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎంపి కొనకళ్లకు టిడిపి సభ్యత్వ కార్డు అందచేత
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 25: బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు శనివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డును అందుకున్నారు. ఇటీవల నిర్వహించిన సభ్యత్వాల నమోదు అనంతరం పార్టీ జారీ చేసిన సభ్యత్వ కార్డును శనివారం మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ చేతుల మీదుగా ఎంపి కొనకళ్ల అందుకున్నారు. సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరూ సభ్యత్వ కార్డులను పొందాలని ఎంపి కొనకళ్ల ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జ్ షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ నీటి వాడకంపై పంచాయితీ కొరడా

మైలవరం, మార్చి 25: మైలవరం పంచాయితీలో అక్రమ మంచినీటి వాడకంపై పంచాయితీ అధికారులు కొరడా ఝుళిపించారు. పంచాయితీ పరిధిలో ఉన్న మంచి నీటి ట్యాప్‌లకు అనేక మంది అక్రమంగా పైప్‌లను తగిలించి నీటిని తమతమ ఇళ్ళలోకి మలుచుకుంటున్నారు. దీని వల్ల అందరికీ నీరు అందటం లేదు. దీనిపై అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు పంచాయితీ పాలకవర్గం, అధికారులు దృష్టి సారించారు. శనివారం ట్యాపులకు అక్రమంగా తగిలించిన పైప్‌లను గుర్తించి వాటిని వెంటనే తొలగించి పైప్‌లను సీజ్ చేసి ట్రాక్టర్‌పై తరలించారు. ఈసందర్భంగా కార్యదర్శి రఫి మాట్లాడుతూ పంచాయితీలో ట్యాపులకు అక్రమంగా పైప్‌లు వేస్తే చర్యలు తప్పవన్నారు. ముందస్తు చర్యలుగా పైప్‌లను సీజ్ చేస్తామని ఐనప్పటికీ అక్రమాలు కొనసాగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.