కృష్ణ

పాపం ఏం కష్టమొచ్చిందో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, మార్చి 25: పాపం ఆ విద్యార్థికి ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ తన ఉజ్వల భవిష్యత్తును చేతులారా సమాధి చేసుకున్నాడు. ఇప్పటి వరకు నా తల్లిదండ్రులను మోసం చేశాను.. ఇకపై చేయలేను.. తన చావుకి ఎవరూ కారణం కాదు.. అన్నయ్యలు.. అమ్మ, నాన్న జాగ్రత్త అంటూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం సహచర విద్యార్థులను, అధ్యాపకులను తీవ్రంగా కలచి వేసింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామానికి చెందిన తుపాకుల వెంకటరెడ్డి (24) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబిఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం తన స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో గడిపి వచ్చిన వెంకటరెడ్డి శనివారం ఉదయం రొయ్యల చెరువు గట్టుపై శవమై కనిపించాడు. శుక్రవారం రాత్రి రూమ్‌కు రాని వెంకటరెడ్డి శనివారం ఉదయం మార్కెట్‌యార్డు పక్కనే ఉన్న రొయ్యల చెరువు గట్టు వద్ద శవమై కనిపించడంతో తోటి విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పామర్రు ఎస్‌ఐ అభిమన్యుడు, గుడ్లవల్లేరు తహశీల్దార్ స్వర్ణమేరి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా సాయంత్రం సమయంలో తండ్రి వెంకటేశ్వరరావు, బంధువులు ఘటనా స్థలికి వచ్చారు. వెంకటరెడ్డి జేబులో ఆత్మహత్య లేఖను గుర్తించిన కుటుంబ సభ్యులు తీసి చూడగా పై విధంగా రాసి ఉంది. దీన్నిబట్టి కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి తల్లిదండ్రులు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు.

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

* వైసిపి రాష్ట్ర నేత సామినేని డిమాండ్

వత్సవాయి, మార్చి 25: ప్రభుత్వం మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. మండలంలోని పలు ప్రాంతాల్లో సామినేని ఉదయభాను శనివారం మిర్చి కళ్లాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారు అయ్యిందని అన్నారు. అరుగాలం కష్టపడి రైతులు మిర్చి పండిస్తే నేడు అమ్మే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం మాటలు చెప్పకుండా రైతులకు అనుకూలమైన గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కామినేని రాంబాబు, గుత్తా శంకరరావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.