కృష్ణ

జెడ్పీ ఉద్యోగులు కమిట్‌మెంట్‌తో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 25: జిల్లా పరిషత్ ఉద్యోగులు కమిట్‌మెంట్‌తో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెడ్పీ ఇన్‌ఛార్జ్ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ కోరారు. ఇటీవల ఇన్‌ఛార్జ్ సిఇఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శనివారం జెడ్పీ కార్యాలయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, దీపం పథకం కింద గ్యాస్ కనక్షన్ల పంపిణీ, ఉపాధి హామీ పనులు, స్వచ్ఛ భారత్ తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎప్పటికప్పుడు ఎంపిడివోలను సమన్వయపర్చుకుంటూ పథకాల అమలుకు కృషి చేయాలన్నారు. పని భారం పడకుండా ఎప్పటికప్పుడు ఫైళ్లను క్లియర్ చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కలెక్టర్ బాబు.ఎ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. ఈ నెలాఖరు నాటికి నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాలన్న లక్ష్యం నెరవేరేందుకు కృషి చేయాలన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ దీపం పథకం కింద గ్యాస్ కనక్షన్లు మంజూరు చేయాలన్నారు. ప్రతి శనివారం జెడ్పీ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సిఇఓ కృష్ణమోహన్, ఎఓ సుబ్బారావు, వివిధ సెక్షన్‌ల సూపరింటెండెంట్‌లు, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.