కృష్ణ

భారత సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా బ్లూ అండ్ గ్రీన్ ప్రాజెక్టు రూపకల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 19: నగరంలో చేపట్టిన బ్లూ అండ్ గ్రీన్ ప్రాజెక్టులో భాగంగా నదీ కాల్వగట్లను ఆధునికీకరించే చర్యల్లోభారత దేశ సంస్కృతీ, సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ సూచించారు. రానున్న పుష్కరాల సందర్భంగా నదీ పరివాహక గట్ల అభివృద్ధిపై చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు మంగళవారం ఉదయం ఆయన తన ఛాంబర్‌లో చైనాకి చెందిన జిఐసిసి సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పవర్ పాయింట్ ద్వారా వారు చేపట్టే ప్రాజెక్టు వివరించిన అనంతరం వీరపాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి చిహ్నం ప్రతిబింబించే విధంగా డిజైన్‌లో మార్పులు చేర్పులు చేసి రెండు రోజుల్లో ఇవ్వాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు, బందర్, రైవస్ కాల్వగట్ల ప్రాంతాల గ్రీనరీని అభివృద్ధి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పి అరుణ్‌బాబు, ఇఇ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.