కృష్ణ

బీసీ రుణాల ఆన్‌లైన్‌పై దద్ధరిల్లిన మండల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మార్చి 26: బీసీ కార్పొరేషన్ కింద మంజూరైన అదనపు రుణాలను ఆన్‌లైన్ చేయటంలో జరిగిన పరిణామాలపై మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అట్టుడికింది. టిడిపి, వైసిపి సభ్యుల వాదనలతో సమావేశం దద్ధరిల్లింది. ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన ఆదివారం ఏర్పాటైన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎంపిపి మాట్లాడుతు 48 బీసీ రుణాలను కమిటీకి తెలియకుండా అప్‌డేట్ ఎలా చేశారని ఎంపిడివో పద్మసుధ సమాధానం అడిగారు. తాను మూడు రోజులు సెలవులో ఉండగా రుణాల జాబితాను అప్‌డేట్ చేశారని, ఎవరు చేశారో తనకు తెలియదని పద్మసుధ తెలిపారు. పాస్‌వర్డ్ మీకు తెలియకుండా ఇంకా ఎవరికి తెలుసని, ఎవరు చేశారో తేలిన తరువాతే సభ జరగాలని ఎంపిపి పట్టుబట్టారు. దీంతో పాములలంక సర్పంచ్ పాముల శ్రీనివాసరావు, ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్ కలుగజేసుకుని మొదట్లో వచ్చిన రుణాలను జన్మభూమి కమిటీలకు తెలియకుండా బ్యాంకులకు ఎలా పంపించారని, అపుడు తాము సరిపెట్టుకుని సంతకాలు పెట్టామని, ఎంపిపి ఇపుడు రాద్ధాంతం చేయటం తగదని శ్రీనివాసరావు అన్నారు. దీంతో ఎంపిపి, టిడిపి సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈవోపిఆర్‌డి అరుణకుమారి, సూపరింటెండెంట్ నాగేశ్వరరావుని ఎంపిపి, జడ్పీటీసీ తాతినేని పద్మావతి వివరణ అడగ్గా వారుకూడా తమకు తెలియదని చెప్పారు. దీంతో ఎంపిడివో లిఖిత పూర్వకంగా లేఖ రాసివ్వాలని ఎంపిపి పట్టుబట్టారు. ఎంపిడివో రాసిచ్చిన సమాధానం సక్రమంగా లేకపోవటంతో ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తు తనకు తెలియదని అబద్ధపు సమాధానం చెప్పొద్దని, జూనియర్ అసిస్టెంట్ బ్రహ్మేశ్వరరావు, అటెండర్ సబిత, పాములలంక సర్పంచ్ శ్రీనివాసరావులను ఉయ్యూరు ఎంపిడివో ఆఫీసుకు పంపి అక్కడ లబ్ధిదారుల పేర్లు అప్‌డేట్ చేసిన మాట వాస్తవం కాదా, నేను ప్రమాణం చేస్తాను, మీరు ప్రమాణం చేస్తారా అని ఎంపిడివోని ఎంపిపి నిలదీయటంతో ఆమె వౌనందాల్చింది. దీంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కలుగజేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేయాలని జడ్పీటీసీ పద్మావతి కోరారు.

ప్రజాప్రతినిధులు సమన్వయంతో
పనిచేస్తేనే ప్రజలకు న్యాయం: ఎమ్మెల్యే కల్పన
తోట్లవల్లూరు, మార్చి 26: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధులు కీచులాడుకుని ప్రజలకు అందకుండా చేయకుడదని, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని పామర్రు ఎమ్మెలే ఉప్పులేటి కల్పన సూచించారు. ఆదివారం మండల పరిషత్ సమావేశానికి కల్పన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాలు నిర్విరామం చేయకుండా లబ్ధిదారులకు అందేలా కృషిచేయాలని, అప్పుడే ప్రజల్లో అందరికీ విలువ ఉంటుందని తెలిపారు. అలాగే 2014లో నాయకుల హామీపై గృహాల నిర్మాణం మొదలుపెట్టి ఒక్కబిల్లు కూడా తీసుకోని వారిపేర్లను 30వ తేదిలోగా హౌసింగ్ ఏఈ శివప్రసాద్‌ని ఎమ్మెల్యే కోరారు. మినుము నష్టపరిహారం రైతులందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తహశీల్దార్ జి భద్రు, మండల ప్రత్యేకాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.