కృష్ణ

మహిళల ఉపాధికి చేయూతనివ్వడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 26: మహిళల ఉపాధికి చేయూతనివ్వడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ అనూరాధ అధ్యక్షతన ఆదివారం గ్రామీణాభివృద్ధి, విద్య-వైద్యం, ఆర్థికం, పనులు అంశాలపై 3, 4, 1, 7 స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి అధ్యక్షతన వ్యవసాయంపై రెండవ స్థారుూ సంఘ సమావేశం, జెడ్పీటిసి పొట్లూరి శశి అధ్యక్షతన 5వ స్థారుూ సంఘ సమావేశం, బంటుమిల్లి జెడ్పీటిసి దాసరి కరుణాజ్యోతి అధ్యక్షతన 6వ స్థారుూ సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా వృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆశయమన్నారు. కుటుంబంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లైతే ఆర్థికంగా వృద్ధి చెందుతారన్నారు. జిల్లాలో 6లక్ష మంది డ్వాక్రా మహిళలకు కోట్లాది రూపాయలు రుణాలుగా అందిస్తున్నప్పటికీ తగిన ఉపాధి పొందలేకపోతున్నారన్నారు. డిఆర్‌డిఎ తదితర ప్రభుత్వ శాఖల ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. అయితే రొటీన్‌గా శిక్షణ ఇస్తున్నారే గానీ వివిధ శాఖల సమన్వయంతో నేటి అవసరాలకు తగ్గట్టు విభిన్న రంగాల్లో శిక్షణ ఇచ్చినట్లైతే బాగుంటుందని అధికారులకు సూచించారు. జెడ్పీ ద్వారా రెండున్నర యేళ్లుగా కుట్టు శిక్షణ, మగ్గం వర్కు, కంప్యూటర్ తదితర రంగాల్లో ప్రభుత్వ, స్వచ్చంద సంస్థల సహకారంతో 20 మండలాల్లో 1454 మంది మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వీరిలో 1059 మంది కుట్టు శిక్షణ పొందారని, వీరంతా ఆర్థికంగా ఎదగడానికి ఒక్కొక్కటి రూ.4800లు విలువ చేసే డొమెస్టిక్ కుట్టు మిషన్లు అందజేశామన్నారు. జిల్లాలో పెన్షన్‌ల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగిన లబ్ధిదారులకు పెన్షన్ అన్నింటికీ ఆధార్ అనుసంధానం కావడం వల్ల ఏ బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నది తెలియడం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకులన్నీ సమన్వయం అనుసంధానం కావడం ఒక్కటే మార్గమన్నారు. జెడ్పీ ద్వారా ఆహారజ్యోతి కింద మహిళలకు చిరు ధాన్యాల పోషకాల పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 202 కోట్ల రూపాయల ఖర్చుతో 76లక్షల పని దినాలు కల్పించామని, పంట సంజీవని కింద 15వేల ఫాం పౌండ్స్ ఏర్పాటు లక్ష్యంతో 11వేలు పూర్తి చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు ఫిర్యాదు చేశారు. చేనేత కార్మికులు వస్త్రాల తయారీలో నీటి కొరత ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశాల్లో ఇన్‌ఛార్జ్ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ, ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి, జెడ్పీటిసిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.