కృష్ణ

ఎమ్మెల్యే రోజా, కాంగ్రెస్ నేత పద్మశ్రీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, మార్చి 27: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వైకాపా నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఆర్‌కె రోజా విమానాశ్రయంలో కరచాలనం చేసుకున్నారు. విజయవాడ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై టిడిపి నేతలు చేసిన దౌర్జన్యం గురించి వీరు చర్చించుకున్నారు. ప్రజా సమస్యలపైన, టిడిపి నేతల దౌర్జన్యాలపైన స్పందించిన ఎమ్మెల్యే రోజాను పద్మశ్రీ అభినందించారు. కాగా అఖిల భారత టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్, ఎపిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి తదితరులు హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు విచ్చేశారు. వీరికి ఆయా పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.

20వ వార్డు కౌన్సిలర్‌గా నాగరాజుకు డిక్లరేషన్
పెడన, మార్చి 27: స్థానిక 20వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన టిడిపి అభ్యర్థి యర్రా నాగరాజుకు సోమవారం ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ మనె్నం గోపాలరావు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. దివంగత చైర్మన్ యర్రా శేషగిరిరావు ఆకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు ఇతర పార్టీల తరఫున ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో నాగరాజు ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగియటంతో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి యర్రా నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కమిషనర్ గోపాలరావు డిక్లరేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, ప్రధాన కార్యదర్శి వాహబ్ ఖాన్, మైనార్టీ నాయకుడు హమీదుల్లా, షాదీఖానా అధ్యక్షుడు గఫార్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట పాగోలు గ్రామస్థుల ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 27: జనావాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ చల్లపల్లి మండలం పాగోలు గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మద్యం దుకాణాల ఏర్పాటుతో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగుబోతుల చేష్టలతో నిరంతరం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ బాబు.ఎను కలిసి వినతిపత్రం అందజేశారు.

పల్స్ సర్వే ఆధారంగా ‘ఆరోగ్యరక్ష’ అర్హులను గుర్తించాలి

* వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బాబు.ఎ

మచిలీపట్నం, మార్చి 27: ప్రజాసాధికారత సర్వే ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరినీ ఆరోగ్యరక్ష పథకంలో నమోదు చేయాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.