కృష్ణ

ఉద్యోగ విరమణ రోజునే సకల ఆర్థిక ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 27: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ విరమణ ఆర్థిక ప్రయోజనా లు ఇకపై భవిష్య సాఫ్ట్‌వేర్ ద్వారా త్వరితగతిన పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ తెలిపారు. నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో అకౌంట్స్ మినిస్టీరియల్ సిబ్బందికి సోమవారం భవిష్య సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భవిష్య సాఫ్ట్‌వేర్‌పై కస్టమ్స్ శాఖ లో వేతనాలు తయారు చేసే సిబ్బంది క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన పెం చుకోవాలని కోరారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని కస్టమ్స్ కార్యాలయాల్లో నూతన ఆర్థిక సంవత్సరం నుంచి శాఖాపరంగా అన్ని పదవీ విరమణ ఆర్థిక ప్రయోజనాలను భవిష్య సాఫ్ట్‌వేర్ ద్వారానే ఆన్‌లైన్ విధానంలో చేపట్టాలని సూచించారు. పదవీ విరమణ చేసే ఉద్యోగికి డిసిఆర్‌జి, జిపిఎఫ్, ఇన్సూరెన్స్, లీవ్ శాలరీ వంటి నగదు ప్రయోజనాలు రిటైర్డ్‌మెంట్ రోజునే చెల్లించడం వంటి ప్రక్రియ భవిష్య సాఫ్ట్‌వేర్ పద్దతిన అమలు కానున్నాయని వివరించారు. నూతన విధానం వల్ల విలువైన డాక్యుమెంటేషన్‌తోపా టు కాగిత వాడకం గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ విధానంలో ఉద్యోగికి పెన్షన్ తదితర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో ఎలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉండదన్నారు. ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా ఒక మ్యాప్ క్రియేట్ చేయడం ద్వారా నగదు జమలన్నీ నేరుగా పదవీ విరమణ చేసే ఉద్యోగు ల ఖాతాల్లోకి చేరతాయన్నారు. ఇకపై పదవి విరమణ పొందిన వారు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. అనంతరం నూతన సాఫ్ట్‌వేర్ విధానాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా న్యూఢిల్లీ నుంచి వచ్చిన శిక్షణ అధికారి షేక్ జావెద్ ఉద్యోగులకు వివరించారు. ఒక్కొక్క ఉద్యోగి ఒక్కొక్క కంప్యూటర్ ద్వారా ప్రత్యక్షంగా సాఫ్ట్‌వేర్ తీరుతెన్నులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో సిఇఓ జ్యోతి రామకృష్ణ, ఏసిఏఓ కెఎన్ శాస్ర్తీ, ఏఓలు సామ్రాజ్యం, శ్రీమన్నారాయణ, సూపరింటెండెంట్‌లు గుమ్మడి సీతారామయ్య చౌదరి, మిక్కిలినేని శ్రీనివాస్, కెపి సాగర్, శ్రీనివాస్ చౌదరి పాల్గొన్నారు.

బందరు బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి

మచిలీపట్నం, మార్చి 27: బందరు నూతన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు. స్థానిక శివగంగ డ్రైన్ నుండి సుల్తానగరం పెట్రోలు బంక్ సమీపంలో విజయవాడ రోడ్డుకు కలిపే నూతన బైపాస్ రోడ్డు పనులను సోమవారం కలెక్టర్ పరిశీలించారు. విజయవాడ నుండి చల్లపల్లి వైపు వెళ్లేందుకు నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు తెర పడుతుందన్నారు. సకాలంలో బైపాస్ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ రహదారి నిర్మాణానికి భూసేకరణ పూర్తిచేసి రైతులకు నష్టపరిహారం చెల్లించి భూమిని జాతీయ రహదారుల సంస్థకు అప్పగించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ప్రత్యేక హోదా కావాలా.. వద్దా?
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 27: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా, వద్దా అనే విషయంపై ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్ కార్యక్రమంలో భాగం గా సోమవారం ఉదయం యనమలకుదురులో డిసిసి అధ్యక్షుడు ధనేకుల మురళీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన రాష్ట్రం సమాగ్రాభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా 5 కాదు 10, 10 కాదు 15 సంవత్సరాల పాటు కావాలని కోరిన నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్ష పార్టీలైన టిడిపి, బిజెపి నేడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ను కాలరాసి ప్రత్యేక ప్యాకేజీని తెరమీదకు తీసుకురావటం అప్రజాస్వామికమన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా హోదాలో ఉన్న నిబంధనల కారణంగా అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తాయని, తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ మొదట నుంచీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తోందన్నారు. అయితే ప్రత్యేక హోదాపై ప్రజలకు ఉన్న అభిప్రాయం తెలుసుకోడానికి ప్రజాబ్యాలెట్‌ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని కోరారు. అలాగే అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సిఎం చంద్రబాబు, తన హామీలను అమలు జరిగాయా, లేదా అనే విషయంపై కూడా ప్రజాబ్యాలెట్‌లో ఓటు రూపంలో చెప్పాలన్నారు. తొలుత యనమలకుదురు అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన బజార్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, పిసిసి ప్రధాన కార్యదర్శి నరహరశెట్టి నరశింహరావు, పి నాంచారయ్య, అన్వర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.