కృష్ణ

టిఎన్‌ఎస్‌ఎఫ్ మాజీ నేత అప్పసాని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, మార్చి 28: తెలుగునాడు విద్యార్థి సంఘం మాజీ ఉపాధ్యక్షుడు అప్పసాని ఈశ్వరరావు (35) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సారీ ఫ్రెండ్స్, సేవ్ టిడిపి అంటూ ఫేస్ బుక్‌లో మూడు పేజీల లేఖను లోకేష్‌బాబుకు అడ్రస్ చేస్తూ పోస్టింగ్ పెట్టాడు. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గడ్డమణుగు గ్రామానికి చెందిన అప్పసాని ఈశ్వరరావు విద్యార్థి సంఘం నాయకునిగా టిడిపిలో పనిచేశారు. మాజీ డిసి చైర్మన్ అప్పసాని వెంకయ్య కుమారుడైన ఈశ్వరరావు విద్యార్థి దశ నుంచే క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వాడు. అతను గత యేడాది దుబాయ్‌లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళాడు. ఈనెల 10న ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ కలుసుకుంటూ ఎంతో అన్యోన్యంగా గడిపాడు. ఇక్కడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఐడిఎలోని తాజ్ లాడ్జిలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈశ్వరరావు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందుగానే ఫేస్ బుక్‌లోని తన అకౌంట్‌లో లోకేష్‌బాబుకు అడ్రస్ చేస్తూ లేఖను పోస్ట్ చేశాడు. ఇతను బుధవారం మధ్యాహ్నం దుబాయ్ వెళ్ళాల్సి ఉంది. తనను అనివార్య కారణాల వల్ల దుబాయ్ వెళ్ళిపోయేలా చేశారని లేఖలో పేర్కొన్నాడు. ఈనెల 10న తన స్వగ్రామమైన గడ్డమణుగుకు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడి రాజకీయ పరిస్థితులు చూసి తట్టుకోలేక పోయానని, తన కుటుంబం ఎప్పటినుంచో టిడిపికి విశేష సేవలందించినా, పార్టీలో కొందరి వల్ల తమకు అన్యాయం జరిగిందని తెలిసినా మంత్రి గానీ, మండల పార్టీవారు గానీ తన కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నారని పేర్కొన్నాడు. రాజకీయం చేయలేక, తన కుటుంబానికి ఏనాడు ఎటువంటి ప్రాణహాని జరుగుతుందో అనే భయంతో తాను మళ్ళీ దుబాయ్ వెళ్ళలేక ఇలా వదిలి వెళ్తున్నాను అని లేఖలో పేర్కొన్నాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు తల్లిదండ్రులను బాగా చూసుకోమని తన సోదరునికి మెసేజ్ పంపినట్లు తెలిసింది. ఈశ్వరరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఎంతో సరదాగా గడిపే ఈశ్వరరావు మృతిని స్నేహితులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జి.కొండూరు మండల టిడిపి నాయకులు, స్నేహితులు లాడ్జికి చేరుకుని ఈశ్వరరావు మృతదేహాన్ని సందర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.