కృష్ణ

అన్నదాతకు సేవలందిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, మార్చి 28: దివంగత నందమూరి తారక రామారావు స్వగ్రామమైన పామర్రు మండలం నిమ్మకూరులోని ఓ వ్యవసాయ విద్యార్థిని నందమూరి యామినీరమ ఆల్ ఇండియా స్థాయి గేట్‌లో 43 ర్యాంక్ సాధించి నిమ్మకూరును ఆనందమూరిగా నిలిపింది. వివరాల్లోకి వెళితే నందమూరి మురళీకృష్ణ, ధనలక్ష్మిల పుత్రిక యామిని గుడివాడ, విజయవాడలో టెన్త్, ఇంటర్ చదివి, గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో బిటెక్ (వ్యవసాయం) విద్య నభ్యసించింది. ఆన్‌లైన్ గేట్ ఎంట్రన్స్ రాయగా 43వ ర్యాంక్ సాధించింది. మంగళవారం నిమ్మకూరు వచ్చిన యామిని తల్లిదండ్రుల సమక్షంలో విలేఖర్లతో మాట్లాడుతూ ఖరగ్‌పూర్ ఐఐటిలో సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్ ఎంటెక్‌లో చేరి భూ ఆరోగ్య పరిరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు సేవలందిస్తానని వెల్లడించింది. అన్నదాతకు సేవ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తానని తమ కుటుంబం వ్యవసాయ కుటుంబమని వివరించింది. కానిపక్షంలో ఫుడ్ ప్రొసిసెంగ్ కోర్సులో చేరి ఆహార ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పిస్తానని యామిని ఆనందంతో వెల్లడించింది.