కృష్ణ

జిల్లాలో టెన్త్ పరీక్షలు ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 30: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 17వతేదీ నుండి ప్రారంభమైన పరీక్షలు గురువారం జరిగిన సోషల్ స్టడీస్-2 పేపర్‌తో ముగిశాయి. శుక్ర, శనివారాల్లో ఒకేషనల్, ఓరియంటల్ (సంస్కృతం) పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల ప్రారంభం నుండి ముగింపు వరకు ఒక్క మాల్‌ప్రాక్టీసు కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. చివరి రోజైన గురువారం నిర్వహించిన సోషల్ పేపర్-2 పరీక్షకు 56వేల 626 మంది విద్యార్థులకు గాను 56వేల 347 మంది హాజరయ్యారు. 279 మంది గైర్హాజరయ్యారు. జిల్లా పరిశీలకులు, కాకినాడ ఆర్‌జెడి దేవానందరెడ్డి నాలుగు పరీక్షా కేంద్రాలు, జిల్లా విద్యా శాఖాధికారి ఎ సుబ్బారెడ్డి నాలుగు పరీక్షా కేంద్రాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 79 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. ఏప్రిల్ 3వతేదీ నుండి 16వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఎ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో నిర్వహించే మూల్యాంకనంకు సుమారు 2వేల మంది ఉపాధ్యాయులు పాల్గొననున్నట్లు తెలిపారు.
కృష్ణా వర్శిటీ డిగ్రీ తృతీయ సంవత్సర ఫలితాలు విడుదల
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 30: కృష్ణా విశ్వ విద్యాలయం, అనుబంధ కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షలు ముగిసిన పది రోజుల్లో ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఫలితాలను ఉపకులపతి ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు ఫలితాలను విడుదల చేశారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది 55.40శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని ఉపకులపతి రామకృష్ణారావు తెలిపారు. 67.16 శాతంతో బాలికలు పై చెయ్యిగా నిలిచారన్నారు. బికాం (ఆనర్స్)లో 93.55 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. మొత్తం 9వేల 762 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 5వేల 408 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఉత్తీర్ణతా శాతం 67.16గా నమోదైందన్నారు. బికాం ఒకేషనల్ కోర్సులో 79.31 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఈ ఫలితాల్లో 87.39శాతం మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో, 5.33 శాతం మంది ద్వితీయ శ్రేణిలో, 7.29 శాతం మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నారు.
ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌తో పాటు స్కూల్స్9 వెబ్‌సైట్, మనబడి, ఇండియారిజల్ట్స్ తదితర వెబ్‌సైట్‌లలో పొందుపర్చినట్లు చెప్పారు. సమాధాన పత్రాల పునః మూల్యాంకణ కోసం ఏప్రిల్ 15వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, మాజీ ఉపకులపతి ఆచార్య వి వెంకయ్య, పరీక్షల విభాగం ముఖ్య అధికారి ఆచార్య వైకె సుందరకృష్ణ, డా. ఎంఆర్‌ఎఎఆర్ పిజి సెంటర్ ప్రత్యేక అధికారి ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, పరీక్షల విభాగం యువజి కో-ఆర్డినేటర్ డా. ఎం లక్ష్మీ నారాయణ, పరీక్షల స్పెషల్ ఆఫీసర్ డా. ఎం బాబూరెడ్డి, కంప్యూటర్ ప్రొసెసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.