కృష్ణ

నా కొడుకును బలిపశువును చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, మార్చి 31: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నందిగామ శివారు అనాసాగరంకు చెందిన పిడతల సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించడం పట్ల అతని తల్లి మరియమ్మ ఆనందం వ్యక్తం చేసింది. చేయని నేరానికి తన కొడుకు సత్యంబాబు 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరో చేసిన నేరానికి తన కొడుకును బలిపశువు చేశారని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ఈ తీర్పు రుజువు చేసిందని అన్నారు. అసలైన దోషులను పట్టుకోవడంతో పాటు తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అన్యాయంగా శిక్ష అనుభవించిన తన కుమారుడికి జీవనోపాధి, కుమార్తె వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరింది. పక్కా గృహం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. తన కొడుకుపై అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపినా గ్రామస్తులు తనకు అండగా నిలిచారని పేర్కొంది. కూలీ పనులు చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాని చెప్పింది. కాగా హైకోర్టు తీర్పు పట్ల అనాసాగరంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సత్యంబాబు బంధువులు, ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆకట్టుకున్న సత్యహరిశ్చంద్ర నాటకం
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 31: స్థానిక కోనేరు సెంటరులో పండ్లు, కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర నాటకం ప్రేక్షకులను రంజింప చేసింది. హరిశ్చంద్రునిగా మట్టా వెంకటేశ్వరరావు, రామమోహనరావు, తాడికొండ నాగార్జున, దిరిశం శ్రీనివాస్, చంద్రమతిగా కమల కుమారి, విశ్వామిత్రుడు, వీరబాహుడిగా బొడ్డు నాగరాజు, కలహకంటి, మాతంగిగా వి కృష్ణకుమారి, సత్యకీర్తి, కాలకౌశికుడుగా లింగం రామచంద్రరావు, శిష్యులుగా మహమ్మద్‌బేగ్, మోహనరావు, లోహితాస్యుడిగా ఆకాష్ అభినయించారు. సందర్భోచితంగా వారు ఆలపించిన పద్యాలు ఆకట్టుకున్నాయి. హార్మోనియంపై ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు, డోలక్‌పై ఎమ్‌డి పెదబాబు అందించిన వాయిద్య సహకారం కార్యక్రమానికి వనె్న తెచ్చింది.