కృష్ణ

‘కొల్లు’కు మళ్లీ మూడు శాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 3: ఇప్పటి వరకు మూడు శాఖల మంత్రిగా కొనసాగిన కొల్లు రవీంద్రకు ప్రస్తుతం ఉన్న శాఖల స్థానంలో సరికొత్త శాఖలు వచ్చాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం శాఖల మార్పులు, చేర్పుల్లో జిల్లా కేంద్రం బందరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొల్లు రవీంద్రకు ప్రస్తుతం ఉన్న మూడు శాఖల్లో రెండు శాఖలను తొలగించి ఏదైనా ఒక శాఖను ఉంచుతారని ప్రచారం జరిగింది. కానీ ఉన్న మూడు శాఖలను తొలగించి మరో మూడు శాఖలను ఆయనకు కేటాయించారు. అత్యున్నతమైన న్యాయ శాఖతో పాటు క్రీడా, యువజన సర్వీసులు శాఖలను ఆయనకు అప్పగించారు. శాఖలు తగ్గితే కొంత మేర కొల్లు రవీంద్ర వర్గం అసంతృప్తికి గురయ్యేది. కానీ కొత్తగా ఇచ్చిన శాఖలు కూడా ప్రాధాన్యత గలవి కావటంతో ఆయన వర్గం ఏ మాత్రం అసంతృప్తికి గురి కాలేదు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్టేడియంల నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కూడా క్రీడాభివృద్ధికై ఔట్ డోర్ అండ్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి రవీంద్ర ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బైపాస్ రోడ్డు సమీపంలోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా స్టేడియం నిర్మాణానికి గుర్తించారు. ఇప్పటికే క్రీడల శాఖ నుండి నిర్మాణానికై రూ.2కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి రవీంద్రకు క్రీడల శాఖ అప్పగించటంతో స్టేడియం కల సాకారం కానుంది. అలాగే రాష్ట్ర మంత్రివర్గంలోనే అత్యంత యువకుడైన రవీంద్రకు యువజన సర్వీసుల శాఖను కూడా అప్పగించటం ఆయనకు ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు. ఒక యువకుడుగా మచిలీపట్నంలో యువతలో స్కిల్ డెవలప్‌మెంట్స్‌ను పెంచేందుకు రవీంద్ర అవిరళ కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లల్లో ప్రతి యేడాది జనవరిలో యువకెరటాలు పేరుతో యువతకు మార్గదర్శకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతున్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని యువకెరటాలకు ఆహ్వానించి యువతను మేల్కొల్పే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా యువత ఆలోచనలకు తగ్గట్టుగా బందరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇక న్యాయ శాఖ మంత్రిగా కూడా రవీంద్ర చక్కని పాత్ర పోషిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు.