కృష్ణ

అధికారులపై టిడిపి నేతల దౌర్జన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఏప్రిల్ 4: అధికార పార్టీకి చెందిన పలువురు మండల స్థాయి నాయకులు అధికారులపై జులుం ప్రదర్శించి, దౌర్జన్యానికి దిగారు. నిజాయితీగా, నిబద్ధతగా పనిచేస్తున్న అధికారిపై స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దౌర్జాన్యానికి పాల్పడ్డారు. తాను చెప్పిన పని ఎందుకు చేయవు? నీకు ఎవరు ఎఇగా ఉద్యోగం ఇచ్చారు? ఉద్యోగం చేస్తున్నావా? ఇంకేమైనా కాస్తున్నావా? నీ సంగతి చూస్తానంటూ అధికారులపై దౌర్జన్యం చేయటంతో దిక్కుతోచని అధికారి పట్టణ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. బాధిత అధికారి విలేఖరులతో మాట్లాడుతూ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజనీరుగా ఎ సత్యనారాయణ రాజు పనిచేస్తున్నారు. దేవరగుంట గ్రామంలో అనర్హులకు ఇళ్ళు మంజూరు చేయాలంటూ నూజివీడు ఎంపిపి టి శ్రీనివాసరావు అధికారిపై వత్తిడి తెస్తున్నారు. ఇళ్ళు మంజూరు చేయకముందే దేవరగుంట గ్రామానికి చెందిన ముళ్ళపూడి పద్మ, వి సామ్రాజ్యం, కొడవలి సుకన్య, నక్కా నాగలక్ష్మీ, జంగంగూడెం గ్రామానికి చెందిన మరో ఇద్దరు లబ్ధిదారులు బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. వీరికి బిల్లులు మంజూరు చేయమని ఎంపిపి శ్రీనివాసరావు వత్తిడి తీసుకువచ్చారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లు ఎఇ సత్యనారాయణ రాజు విలేఖరులకు తెలిపారు. ఉన్నతాధికారులు ఈ ఇళ్ళు మంజూరు చేయలేదని, అయితే నువ్వు ఎందుకు ఇళ్లకు నిధులు మంజూరు చేయటం లేదంటూ ఎంపిపి శ్రీనివాసరావు తనపై నానా విధంగా దుర్భాషలాడారని, చెప్పలేని పదజాలంతో దూషించారని పేర్కొంటూ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. 32 సంవత్సరాల నుండి ఉద్యోగం చేసుకుంటూ విధులు సక్రమంగా, నిజాయితీగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. ‘నేను చెబితే ఎందుకు పనిచేయవు? నీ సంగతి తేలుస్తా’నంటూ బెదిరించారని తెలిపారు. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళానని పేర్కొన్నారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎంపిపి టి శ్రీనివాసరావు తనపై అధికార జులుం ప్రదర్శించి, దూషించారని పేర్కొంటూ ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట కుమార్ మంగళవారం విలేఖరులకు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణావత్ బద్రు సుంకొల్లు గ్రామ రెవిన్యూ అధికారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని రూరల్ పోలీసు స్టేషన్‌లో సోమవారం పిర్యాదు చేశారు. రెవిన్యూ భూముల కొలత విషయంపై అనుకూలంగా వ్యవహరించలేనందున కుల ధూషణ కేసు పెట్టారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ రెవిన్యూ ఉద్యోగులు ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. ఇటీవలి కాలంలో అధికారులపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు జులుం ప్రదర్శిస్తున్నారు. విజయవాడలో జరిగిన సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని వీరు దౌర్జాన్యానికి దిగటంతో ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. కొంతమంది నాయకులు ఈ విధంగా వ్యవహరించటం వల్ల పార్టీ పరువు పోతోందని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా పాల రైతులకు
రూ.26కోట్ల బోనస్
పెడన, ఏప్రిల్ 4: జిల్లాలోని పాల రైతులకు రూ.26కోట్లు బోనస్‌ను అందిస్తున్నామని జిల్లా పాల సంఘం డైరెక్టర్, పెనుమల్లి సంఘం అధ్యక్షుడు అర్జా వెంకట నగేష్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 830 సంఘాలకు సంబంధించిన పాల రైతులకు ఈ ప్రయోజనాన్ని చేకూరుస్తున్నామన్నారు. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 మార్చి 31వ తేదీ వరకు పాలు పోసిన రైతులకు నూటికి 12శాతం బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా చైర్మన్ మండవ జానకీరామయ్య అధ్యక్షతన సమావేశమైన పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుందని నగేష్ తెలిపారు. అలాగే ప్రస్తుతం పాలు పోస్తున్న రైతులకు లీటరుకు రూ.2 చొప్పున పాల సేకరణ ధరను కూడా పెంచుతూ బోర్డు తీర్మానం చేసిందన్నారు. ప్రస్తుతం 10శాతం వెన్న ఉన్న పాలకు రూ.55 చెల్లిస్తున్నామని ఇకపై దీన్ని రూ.57గా నిర్ణయించామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పాల రైతులు వినియోగించుకోవాలని నగేష్ కోరారు. బోనస్‌ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నగేష్ పాల సంఘాల అధ్యక్షులకు సూచించారు.