కృష్ణ

అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 4: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగం పట్ల ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారని రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఎపి ఫార్మసి కౌన్సిల్, జిల్లా కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ సహకారంతో మంగళవారం పట్టణంలో నిర్వహించిన వ్యతిరేక సూక్ష్మక్రిముల నిరోధ అవగాహనా ర్యాలీని మంత్రి రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ పుర వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు మందులు వాడటం ద్వారా ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. తెలిసీ తెలియని విధంగా సొంత వైద్యం అనుసరించి అధికంగా మందులు వాడితే దుష్ఫలితాలు తప్పవన్నారు. సూక్ష్మక్రిములు తమ నిరోధక శక్తి పెంచుకుంటే ఎన్ని మందులు వాడినా పనిచేయవన్నారు. వీటి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం వైద్య రంగం అభివృద్ధికి, మాతా శిశు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతోందన్నారు. గతం కంటే ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సేవలు మెరుగుపడ్డాయన్నారు. ర్యాలీ అనంతరం ఆస్పత్రి ఆవరణలో రూ.15లక్షలతో నిర్మిస్తున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని మంత్రి రవీంద్ర పరిశీలించారు. శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, డ్రగ్స్ కంట్రోల్ ఎడి పి రాంబాబు, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు, జిల్లా డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిథులు పాల్గొన్నారు.