కృష్ణ

ఉపాధి కూలీలకు పనులు జరిగే చోటే పైసలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 9: ఉపాధి హామీ కూలీలకు పనులు జరిగిన చోటే పైసలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి రావూరి రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మండలంలోని పుల్లూరు సమీపంలో పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరు మాసాలుగా తమకు సొమ్ము రావటం లేదని వారు చెప్పారు. పని చేసినవారికి కూలీ ఇవ్వకపోవటంతో కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తోందని వారు వాపోయారు. అనంతరం రామారావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి కేంద్రం నుండి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. గ్రామాలలో పనులు జరుగుతున్న ప్రాంతంలో కూలీలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదని, మండుటెండలో పసి పిల్లలతో పనులు చేస్తున్నవారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. దీని వల్ల వారికి వడదెబ్బ తగులుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈసమస్యలను తెలిపితే గ్రామాలలో జన్మభూమి కమిటీ సభ్యులు వారిష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కూలీలకు పోస్ట్ఫాసు ద్వారా పనిచేసే ప్రాంతంలోనే సొమ్ము ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పనికి తగిన విధంగా కూలీ సొమ్ము ఇవ్వాలని, కూలీలకు మజ్జిగ పంపిణీ చేయాలని, సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు.

నేడు బాల సోమేశ్వర స్వామి
ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం
అవనిగడ్డ, ఏప్రిల్ 9: రామచంద్రపురంలో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ బాల సోమేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివారం విఘ్నేశ్వరపూజ, అంకురార్పణ, జలాదివాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్లను తొలగించి శుభ్రం చేశారు. ధ్వజ స్తంభ ప్రతిష్ఠను పురస్కరించుకుని స్తంభాన్ని సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 8.30గం.లకు ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం శాంతి కల్యాణం, మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బందరు ఎంపి కె నారాయణరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొంటారని భక్తబృందం సభ్యులు తెలిపారు.

కమ్యూనిస్టు నేత చెరకు సీతారామయ్య మృతి
కూచిపూడి, ఏప్రిల్ 9: కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ నాయకుడు, సిపిఐ సానుభూతి పరుడు చెరకు సీతారామయ్య (75) ఆదివారం ఉదయం స్వగృహంలో మృతి చెందారు. కొంత కాలంగా అస్వస్థతగా ఉన్న సీతారామయ్య మరణంతో కుటుంబ సభ్యులు దుఖంలో మునిగిపోయారు. సీతారామయ్య మృతదేహాన్ని ప్రజానాట్య మండలి రాష్ట్ర కోశాధికారి కెవి అప్పారావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దగాని సంగీతరావు, మండల కార్యదర్శి చెరకు శ్రీనివాసరావు, చేనేత కార్మిక నాయకులు కోదాటి నారాయణరావు, రఫాయేలు, రామారావు, నాగేశ్వరరావు, నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. సోమవారం సీతారామయ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారుడు శ్రీనివాసరావు తెలిపారు.