కృష్ణ

భూసమీకరణ పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 10: రానున్న జూన్ నాటికి పోర్టు పనులు ప్రారంభమయ్యేలా భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. భూసమీకరణపై సోమవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంయుడిఎ) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గత యేడాదిగా భూసమీకరణ ప్రక్రియ సాగుతున్నప్పటికీ ఇకపై పూర్తిస్థాయి దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్యాకేజీ పట్ల రైతులు పూర్తి భరోసాతో ఉన్నారన్నారు. తొలుత అల్లర్లు చేసినా నేడు పరిస్థితిలో చాలా మార్పు ఉందన్నారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలో సభలు, సమావేశాలు నిర్వహించి ప్యాకేజీ పట్ల రైతులను మరింత చైతన్యవంతుల్ని చేయాలన్నారు. ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చే రైతులను ఇబ్బందులు పెట్టవద్దని డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోయినా టైటిల్ సమస్యలు ఉన్న ఫారం-2 స్వీకరించవచ్చని అధికారులకు సూచించారు. గ్రామాల్లో రీ ఎక్స్‌ర్‌సైజు చేయాలని, ప్యాకేజీ గురించి రైతులకు మరలా వివరించాలన్నారు. మే నెలాఖరు నాటికి సమీకరణ పూర్తికావాలన్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు త్వరలో ప్యాకేజీ అందించనున్నట్లు తెలిపారు. ఉదయం మంత్రి రవీంద్ర పోర్టు నిర్మాణ ప్రతిపాదిత గ్రామాలైన క్యాంబెల్‌పేట, గోపువానిపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అందించనున్న ప్యాకేజీపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, ముడ డెప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్ నారదముని, విఆర్‌ఓలు పాల్గొన్నారు.
తారకరామ ద్వారా
దాళ్వాకు సాగునీరు
* మంత్రి ఉమ ఆదేశం
జి.కొండూరు, ఏప్రిల్ 10: తారకరామ ఎత్తిపోతల పథకం ద్వారా కుడి, ఎడమ కాలువల కింద సాగవుతున్న మొక్కజొన్న, వరిపైర్లకు సాగునీరు అందించాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం అధికారులను ఆదేశించారు. మంత్రి ఉమను విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో కవులూరు గ్రామ రైతులు సోమవారం కలిసి సాగునీటి సమస్యను వివరించారు. మొక్కజొన్న 150 ఎకరాలు, దాళ్వా 400 ఎకరాల్లో చివరి దశలో ఉన్న పంటలకు సాగునీరు ఇవ్వాలని రైతులు తాటికొండ భాస్కరరావు, చెరుకూరి గంగాధరరావు, మంత్రి ఉమను కోరారు. వెంటనే సంబంధిత డిఇఇకి మంత్రి ఉమ ఫోన్‌చేసి సాగునీటి విడుదలకు ఆదేశించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.