కృష్ణ

అంబేద్కర్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, ఏప్రిల్ 13: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని నేటి యువత మార్గదర్శకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని 125 అడుగుల విగ్రహా నిర్మాణానికి పెనుగంచిప్రోలు దళితవాడలో గురువారం మట్టి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాత సినిమా హాలు సెంటర్ వద్ద నుండి తిరుపతమ్మ అమ్మవారి ఆలయం వరకూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద పలువురు వక్తలు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కె నాగేశ్వరరావు, ఎంపిడిఒ శ్రీనివాసరెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు చింతల సీతారామయ్య, తెదేపా నేతలు ఊట్ల నాగేశ్వరరావు, జిల్లేపల్లి సుధీర్‌బాబు, కాకాని హరిబాబు, మాదినేని వెంకట్రావు, ముండ్లపాటి ప్రభాకరరావు, కొత్తపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన జాతీయ స్థాయి పశు ప్రదర్శన పోటీలు
మోపిదేవి, ఏప్రిల్ 13: గత వారం రోజులుగా మోపిదేవిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఓంగోలు జాతి పశు ప్రదర్శన, పూటీ లాడుగు, బండ లాగుడు పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో 2400 కేజీలు బండ లాగుడు విభాగంలో ప్రథమ బహుమతిని అనంతనేని కావ్యశ్రీ, మధుకు చెందిన ఎడ్ల జత, కోనేరు భావనా చౌదరికి చెందిన ఎడ్ల జత సమాన దూరం లాగటంతో ప్రథమ బహుమతిగా రూ.90వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని తెలుగు వన్ ఫౌండేషన్ అధ్యక్షుడు కంఠంనేని శివ శంకర్ చేతుల మీదుగా అందజేశారు. గుంటూరు జిల్లా తోట శ్రీనివాసరావుకు చెందిన ఎడ్ల జత మూడవ స్థానంలో, మోపిదేవి మండలం కోనేరు నిరూప్ బాబుకు చెందిన ఎడ్ల జత నాల్గవ స్థానం, పెనమలూరు మండలం దేవభక్తుని సుబ్బారావుకు చెందిన ఎడ్ల జత ఐదవ స్థానంలో నిలిచాయి. అప్పిశెట్టి రాధాకృష్ణమూర్తి, సాంబిరెడ్డి రిఫరీలుగా వ్యవహరించారు. జెడ్పీటిసి మెడబలిమి మల్లిఖార్జునరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు పరుచూరి అంజయ్య, కొల్లి మురళీ, కోదండ రామయ్య, టిడిపి మండల అధ్యక్షుడు శీలం శ్రీరాములు, తెలుగు యువత అధ్యక్షుడు విస్సంశెట్టి రాజా తదితరులు బహుమతోత్సవ సభలో పాల్గొన్నారు.