కృష్ణ

అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 13: పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సర్వీసుల సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. అభివృద్ధి పనులపై గురువారం ఆయన తన నివాసంలో ఆర్‌అండ్‌బి, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పోర్టు రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. అమృత పథకం కింద రూ.37కోట్లతో చేపట్టిన మంచినీటి పైప్‌లైన్లు, రిజర్వాయర్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన డ్రైనేజీ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు స్థంభాల సెంటరు నుండి పెడన రోడ్డు వరకు బైపాస్ రహదారి విస్తరణ పనులను నిర్ధిష్ఠ సమయంలో పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులకు సూచించారు. బందరు నియోజకవర్గంలో మత్స్యకారుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలపై కూడా మంత్రి రవీంద్ర సమీక్షించారు. ఈ నెల 22వతేదీ ఉదయం 10గంటలకు టౌన్‌హాలులో మత్స్యకారులకు రూ.20లక్షలు విలువైన వలలు, సైకిళ్లు, ఐస్ బాక్స్‌లు, జిపిఎస్, ఎకో సౌండర్స్ పరికరాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తీర ప్రాంత మత్స్యకారులకు బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు 3,233 మందికి పంపిణీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, ఆర్‌అండ్‌బి ఇఇ మురళీకృష్ణ, మత్స్య శాఖ ఎడి రాఘవరెడ్డి, ఎఫ్‌డిఓ రాజ్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి నాగేంద్ర ప్రసాద్, టిపిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.