కృష్ణ

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 16: స్థానిక 4వ వార్డు సర్కారుతోటలో రూ.5లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన మూడేళ్లల్లో పట్టణంలో పెద్ద ఎత్తున సిసి రోడ్లు నిర్మించామన్నారు. రానున్న రెండేళ్లల్లో కూడా ప్రతి రహదారిని సిసి రోడ్డుగా అభివృద్ధిపర్చనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, కౌన్సిలర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, టిడిపి నాయకులు చలమలశెట్టి రమేష్, కాసాని భాగ్యారావు, పూర్ణ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి రుణం తీర్చుకోవడం అభినందనీయం
* ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి
గూడూరు, ఏప్రిల్ 16: జన్మభూమి రుణం తీర్చుకోవడం అభినందనీయమని మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి అన్నారు. పోలవరం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మచిలీపట్నం, విజయవాడ నాగార్జున ఆస్పత్రి, చలమలశెట్టి దినేష్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్‌ల ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కార్పొరేట్ వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, జిల్లా చైర్మన్‌లు పంచపర్వాల సత్యనారాయణ, జి రామబ్రహ్మం, ప్రముఖ వైద్యులు డా. యర్రంశెట్టి రత్నాకర్, డా. రమ్య, మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 400 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు.