కృష్ణ

ఘనంగా ఈస్టర్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 16: పట్టణంలో ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. యేసు పునరుద్ధానం సందర్భంగా బెరాకా ఆధ్వర్యంలో పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బూత్ స్థాయి నుండి బీజేపిని బలోపేతం చేయాలి
మైలవరం, ఏప్రిల్ 16: బూత్ స్థాయి నుండి భారతీయ జనతాపార్టీని బలోపేతం చేయటం ద్వారా రాబోయే ఎన్నికలలో ఆంధ్రలో కూడా అధికారం చేజిక్కించుకునే విధంగా కార్యకర్తలు శ్రమించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎస్వీఎస్ కల్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సామావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాల నేతృత్వంతో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇందుకు ఇటీవల పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలే నిదర్శనమని ఇదే స్పూర్తితో ఆంధ్రాలోనూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు రేగళ్ళ రఘునాథరెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలలో ప్రభుత్వం, పార్టీ పట్ల విశేషమైన ఆదరణ ఉందని దానిని అందిపుచ్చుకుని కార్యకర్తలు ప్రధాని మోదీ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర పార్టీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ దేశంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఒక్క బీజెపి పార్టీయే కట్టుబడి ఉందని అన్నారు. ఈసమావేశంలో పార్టీ నేతలు జివి నగరాయలు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు వి వెంకట కృష్ణారెడ్డి, నేతలు పి వెంకటేశ్వరరావు, గోపి, రామారావు, ఆంజనేయులు, కృష్ణమూర్తి, నరేష్, యుగంధర్, జె శేఖర్, నాగరాజు, మురళీధర్‌రావు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.