కృష్ణ

నిబంధనలు బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 21: నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, స్థానిక నివాసితులకు ఇబ్బందులకు కలిగించే విధంగా డ్రైనేజీ నీళ్లు వాడపల్లివారి వీధిలో ఉన్న విఎంసి కాలువలోకి వెళ్లే విధంగా పైపులైను ఏర్పాటు చేయటంతో స్థానికులు దుర్గగుడి అధికారులపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఏడు అంతస్తుల మల్లికార్జున మహామండపం నుంచి వచ్చే మొత్తం డ్రైనేజీ నీళ్లు గతంలో కనకదుర్గనగర్ గుండా నేరుగా పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాం ముందు ఉన్న కాలువలోకలిసేవి. మల్లికార్జున మహామండపంలోని 7 అంతస్తుల్లో ఏర్పాటు చేసిన మురుగుదొడ్లు, మూత్రశాలలు, వాటితోపాటుతోపాటు మరికొన్ని పనులకు వినియోగించిన మొత్తం నీళ్లు పైనుండి కిందకు వచ్చి కనకకదుర్గనగర్ పక్కనుండే నేరుగా ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉన్న కాలువలోనికి కలిసేవి. దీని వలన అర్జున వీధి ప్రారంభం నుండి చివరకు ఇరువైపుల నివాసితులు, దానికి అనుసంధానంగా ఉన్న వడ్డేవారి వీధి, గుంటూరువారి వీధి, వాడపల్లివారి వీధి, తదితర వీధుల్లో ఉన్న నివాసితులకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కాగా కొద్ది రోజుల క్రితం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం అధికారులు ఈ ఏడుఅంతస్తుల ద్వారా వచ్చే మురుగునీటిని వాడపల్లివారి వీధిలో ఉన్న వియంసి కాలువలోనికి కలిపే విధంగా పైపులైను రోడ్‌ను పగులకొట్టి వేయవల్సిందిగా దుర్గగుడి ఇంజనీర్ సెక్షన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన వెంటనే వారు ఈపనులు ప్రారంభించారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది ఇందుకు తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పినప్పటికీ దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు ఖాతరు చేయకుండా పనులు చేపట్టారు. ఏడు అంతస్తుల నుండి వచ్చే మురుగునీరు వాడపల్లివారి వీధిలోని వియంసి కాలువ నుండి బ్రాహ్మణ వీధిలో ఉన్న కాలువ లోకి చేరుతాయి. ఇదే జరిగితే బ్రాహ్మణ వీధి రెండు వైపుల ఇళ్లవాళ్లు ఈ కంపును భరించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసనతోపాటు వివిధ రకాలైన క్రిమికీటకాలు వచ్చే అవకాశాలుంటాయని ఈ ప్రాంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బుద్దావారి గుడి వెనుక ఉన్న కల్యాణ మండపాన్ని ప్రసాదాల తయారీ కేంద్రంగా మార్చటంతో ఈ కేంద్రం పరిసర ఇళ్లవాళ్లు విపరీతమైన వేడితో సతమతమవుతున్నారు. మరోవైపు అధిక సంఖ్యలో గ్యాస్‌బండలను నిల్వ చేయటంతో బిక్కుబిక్కుమంటున్న గుంటూరు వీధి, వాడపల్లివారి వీధి వాసులు ఈ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని వెంటనే ఇక్కడి నుండి ఎత్తివేయాలని ఇప్పటికే అనేకసార్లు దుర్గగుడి ఇవోకు వినతి పత్రాలు అందచేసినప్పటీ వారి నుండి ఉలుకూపలుకూ లేదు. దీంతో దుర్గగుడి అధికారుల పనితీరుపై ఈరెండు వీధులకు చెందిన వారు చాలా అగ్రహాంతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాడపల్లివారి వీధిలోకి డ్రైనేజీ వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోడానికి ఈ ప్రాంతవాసులు ఆందోళన చేపట్టడంతోపాటు, అవసరమైతే న్యాయ పరంగా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంపై పోరాటం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. స్థానికుల అభిప్రాయాలను లెక్క చేయకుండా ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలపై రుద్దడం దుర్గగుడి అధికారులకు ఒక అలవాటుగా మారిందనే విమర్శలూ విన్పిస్తున్నాయి.