కృష్ణ

వైఎస్ పాలన జగన్‌తో సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు,ఏప్రిల్ 21: దివంగత వైఎస్ అందించిన సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యమని పామర్రు నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి కైలే అనిల్‌కుకమార్ అన్నారు. తోట్లవల్లూరులోని మల్కాపురం, లైన్‌బజారులో రెండవరోజు శుక్రవారం గడప గడపకు వైసిపి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తు జగన్‌ని బలపర్చాలంటు ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, మండల వైసిపి అధ్యక్షుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, వైస్ ఎంపిపి పిఎస్ కోటేశ్వరరావు, నాయకులు జి సూర్యనారాయణ, కిలారం రామకృష్ణ, కె శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో
ప్రైవేటుకు దీటుగా ఫలితాలు
మైలవరం, ఏప్రిల్ 21: ప్రైవేటు పాఠశాలల్లో ఫలితాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫలితాలు సాధించాలని ఎంపిడిఓ వై హరిహరనాథ్ అన్నారు. స్థానిక ఆదాంపురం ఎంపియుపి స్కూల్ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే చదువుతున్నారని, వారి అభివృద్ధికి, ఉన్నత విద్యకు ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం, దుస్తులు పంపిణీ, పుస్తకాల పంపిణీ వంటి పధకాలతో సహకరిస్తున్నట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నారు. అదేవిధంగా ఐదేళ్ళు నిండిన పిల్లలంతా బడిలోనే ఉండే విధంగా అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి బాణావతు లక్ష్మి, సర్పంచ్ నందేటి కృష్ణవేణి, ఉపసర్పంచ్ షేక్ షహానాబేగం, హెచ్‌ఎం కె కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.