కృష్ణ

ప్రత్యేక నిధులు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, ఏప్రిల్ 21: మునే్నరు ప్రాజెక్టు పూర్తి అయ్యేలోగా రైతులకు నీరు అందించేందుకుగాను రూ.3 కోట్ల నిధులను కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్సీ తొండెపు దశరథ జనార్థన్‌లు కోరారు. శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసిన నేతలు మునే్నరు ప్రాజెక్టు పూర్తయ్యేలోగా రైతులను ఆదుకునేందుకుగాను ఈ నిధులను కేటాయించాలని కోరారు. అలానే దేవస్థానం ఈనాం భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసినందున లబ్థిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గురించి ముఖ్యమంత్రికి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు వేగినేటి గోపాలకృష్ణమూర్తి, విశ్వనాధం, అధికారులు రాము తదితరులు పాల్గొన్నారు.

అవనిగడ్డలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
అవనిగడ్డ, ఏప్రిల్ 21: లా కమిషన్ సిఫార్సు మేరకు న్యాయవాదుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక న్యాయవాదుల సంఘం సభ్యులు శుక్రవారం కోర్టును బహిష్కరించి సవరణ ప్రతులను దగ్ధం చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర కౌన్సిల్ పిలుపు మేరకు ఈ ఆందోళన చేశారు. నూతన సవరణ చట్టం న్యాయవాదుల ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, తక్షణమే విరమించుకోవాలని వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు మత్తి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సుబ్బారావు, ఈశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.