కృష్ణ

నేడు ఎపిపిఎస్‌సి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 21: జిల్లాలో శనివారం నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బాలయ్య నాయుడు లక్ష్మీకాంతం తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై అధికారులతో తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు అధికారులు తీసుకున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-4 స్క్రీనింగ్ పరీక్షకు 40వేల 877 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం జిల్లాలో 82 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10గంటల నుండి 12.30ని.ల మధ్య పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షను సజావుగా నిర్వహించేందుకు 37 మంది లైజన్ అధికారులు, 82 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు, ఎనిమిది మంది అడిషనల్ కో-ఆర్డినేటింగ్ అధికారులను నియమించామన్నారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి 9గంటల నుండి 9.45ని.ల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల్లో ఏదో ఒకదాన్ని తీసుకుని రావాలన్నారు. సెల్‌ఫోన్‌లు, క్యాలిక్‌లేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష పూర్తయ్యే వరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల సౌకర్యార్ధం ఆర్టీసి ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వివరాల కోసం కంట్రోల్ రూం నెంబ.ర్ 0866-2574454ను సంప్రదించాలని కలెక్టర్ లక్ష్మీకాంతం కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

దృశ్యశ్రవణ విద్య ద్వారా ఆసక్తి పెరుగుతుంది
కూచిపూడి, ఏప్రిల్ 21: ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న దృశ్య శ్రవణ విద్య ద్వారా విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక సమాచారాన్ని తెలుసుకోవటంతో వారిలో విద్యపట్ల ఆసక్తి పెరుగుతుందని పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు.
స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి జడ్‌పి ఓరియంటల్ పాఠశాల వసంతోత్సవ సందర్భంగా శుక్రవారం హెచ్‌ఎం కొల్లి సత్య జగదీశ్వరరావుఅధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బడి రుణం తీర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా మొవ్వ ఎఎంసి మాజీ ఛైర్మన్ చీకటిమర్ల శివరామప్రసాద్ ఆయన భార్య అంజనావతి జ్ఞాపకార్థం అందజేసిన విరాళంతో ఏర్పాటు చేసిన నృత్య శ్రవణ విద్యా విభాగాన్ని ఎమ్మెల్యే కల్పన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపిడివో వై.పిచ్చిరెడ్డి, ఎంఇవో తోట వెంకటేశ్వరరావు, ఎంపిటిసి కావూరి భానుమూర్తి, మాజీ సర్పంచ్‌లు వైకెడి ప్రసాదరావు, పి.కాశీ విశ్వనాధం, ఎపి మేనేజర్ నాగేశ్వరరావు, స్వచ్ఛ్భారత్ పర్యవేక్షకుడు బెల్లంకొండ వెంకటేశ్వరరావు, పర్వతం శ్రీలక్ష్మి, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.