కృష్ణ

నీటి కుంటల ద్వారా భూగర్భ జలాల వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఏప్రిల్ 27: పంట సంజీవని వ్యవసాయ నీటి కుంటలు ద్వారా భూగర్భ జలాలను పెంపొందింప చేసుకుని భవిష్యత్తులో సాగునీటి సమస్యను రైతులు అధిగమించాలని మొవ్వ ఎంపిడిఓ వై పిచ్చిరెడ్డి సూచించారు. గురువారం మొవ్వ మండలంలోని చినముత్తేవి, మంత్రిపాలెం, మాకులవారిపాలెం గ్రామాలలో ఎంపిడిఓ పర్యటించారు. స్మార్ట్ విలేజ్‌ల పర్యటనలో భాగంగా మొవ్వ ఎంపిడిఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 21 గ్రామాలలో 3,128 మంది వ్యవసాయ కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారన్నారు. వ్యవసాయ పనులు పూర్తిగా తగ్గటంతో మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలోని 130 గ్రూపులకు చెందిన వ్యవసాయ కూలీలు 84 పనుల్లో పాల్గొన్నారన్నారు. ఎపిఓ రామ్మోహనరావు, హరిబాబు నాయక్ తదితరులు పర్యవేక్షించారు.

ప్రజలకు మంచినీటి ఇబ్బంది లేకుండా చూడాలి
* చైర్మన్ బాబాప్రసాద్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 27: మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తరకటూరు సమ్మర్ స్టోరేజి వద్ద లీకులు అయిన ప్రదేశంలో కొత్త తూములు ఏర్పాటు చేసే పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజలకు మంచినీటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లీకులు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి రోజూ పైపులైన్‌ల లీకేజిలను పర్యవేక్షించాలన్నారు. పైపులైన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి మంచినీటి సరఫరా చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ, మున్సిపల్ ఎఇ, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ చాంబర్‌లో ఎల్‌ఇసి డిపార్టుమెంటు వారు 2017-18 సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను రూ.30లక్షలు చెక్కును చైర్‌పర్సన్ గారికి అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఇసి సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్కంఠ మధ్య నేడు టిడిపి మండల కమిటీ ఎన్నిక
* అధ్యక్ష పదవికి ఐదుగురి పోటీ
* ఏకగ్రీవానికి మంత్రి ఉమ వద్ద పంచాయితీ

మైలవరం, ఏప్రిల్ 27: నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన మైలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి పోటీ తీవ్రమైంది. ఈపదవి కోసం ఐదుగురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఏకగ్రీవానికి మంత్రి ఉమ ప్రతినిధి యలమంచిలి శ్రీనివాస్ స్థానిక పార్టీ కార్యాలయంలో పలుమార్లు సమావేశమై చర్చించారు. ఐనప్పటికీ పదవి కోసం పోటీ పడే నేతలు మాత్రం మెట్టు దిగి రాకపోవటంతో వ్యవహారం జటిలమైంది. ఇప్పటి వరకూ ఈపదవి కోసం ఐదుగురు నేతలు నేనంటే నేనంటూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకూ ఈపదవిలో కొనసాగిన తాతా పోతురాజు మళ్లీ తనకే ఈ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు చేసిన పోతురాజును తప్పించి తమకు అవకాశం కల్పించాలని మిగిలిన నలుగురు వాదిస్తున్నారు. వీరిలో వైస్ ఎంపిపి, తోలుకోడు గ్రామానికి చెందిన ఇనుగంటి శోభన్‌బాబు, మైలవరం పట్టణ 17వ వార్డు మెంబర్ గొల్లపూడి వెంకటేశ్వరరావు, తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి, అనంతవరం గ్రామానికి చెందిన బూదేటి రామారావు, తెలుగురైతు జిల్లా కార్యదర్శి, గణపవరం గ్రామానికి చెందిన కట్టా వెంకటరెడ్డి ఉన్నారు. ఈనెల 28న మండల కమిటీ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం జరపాల్సి ఉంది. దీంతో మంత్రి ఉమ స్వయంగా రంగంలో దిగాల్సి వచ్చింది. పదవికోసం పోటీ పడే ఐదుగురు నేతలను విజయవాడలోని తన క్యాంపు కార్యాలయానికి గురువారం పిలిపించుకున్నారు. ఐదుగురితో మాట్లాడి ఏకగ్రీవానికి అంగీకరింపజేసే విధంగా వారికి తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పనిచేసే వారికి పార్టీలో ఎప్పటికైనా తగిన గుర్తింపు ఉంటుందని వారికి నచ్చచెప్పినట్లు తెలిసింది. ఈనెల 28న స్థానిక శ్రీ షిరిడీ సాయి బాబా కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరై కమిటీని ప్రకటించనున్నట్లు చెబుతున్నారు.