కృష్ణ

9వ తరగతి బాలికలకు 1.82లక్షల ఉచిత సైకిళ్లు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 27: బాలికలు విద్యను మానివేయకుండా కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి మంత్రి రవీంద్ర అన్నారు. గురువారం మంత్రి రవీంద్ర స్థానిక జార్జికారనేషన్ హైస్కూల్‌లో పట్టణంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో 9వ తరగతి చదివే బాలికలకు నూతన సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9వ తరగతి బాలికలకు 1.82లక్షల సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బందరు నియోజకవర్గానికి సుమారు 900 సైకిళ్లు వచ్చాయని, వీటిలో650 సైకిళ్లను మండలంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బాలికల విద్య పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందన్నారు. డ్రాపౌట్స్ తగ్గించేందుకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ నుండి వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్‌మెంటు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ ద్వారా రూ.149లకే టివి ఛానల్స్, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, స్కూల్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు, కౌన్సిలర్లు ప్రసాద్, హేమకుసుమ, తిరుమల, ఇలియాస్ పాషా, ఖాజా బేగ్, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.

ఓవర్‌హెడ్ ట్యాంకును వెంటనే ప్రారంభించాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 27: స్థానిక 4వ వార్డు సర్కారుతోటలో రూ.2కోట్ల 39లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును వెంటనే ప్రారంభించాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు గురువారం ఓవర్‌హెడ్ ట్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.2కోట్ల 39లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించి రెండు సంవత్సరాలు కావస్తున్నా ప్రారంభించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. చిలకలపూడి, సర్కారుతోట, కొబ్బరితోట, మాచవరం తదితర ప్రాంతాలకు దాహార్తిని తీరుస్తామని చెప్పిన పాలకులు ప్రజాధనం వృదా అవుతున్నా ఎందుకు వౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షుడు రామిశెట్టి ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ ధర్మారావు, జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్, పెయ్యల మధు, పట్టం మహిళ అధ్యక్షురాలు ఎన్ కుమారి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

కనకదుర్గమ్మకాలనీకి నీటి ఎద్దడికి గుడ్‌బై
* సర్పంచ్ ఉమాదేవి
తోట్లవల్లూరు, ఏప్రిల్ 27: తోట్లవల్లూరు శివారు కనకదుర్గమ్మకాలనీ ప్రజలకు మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించామని సర్పంచ్ చిరుమామిళ్ళ ఉమాదేవి అన్నారు. కనకదుర్గమ్మకాలనీలో గ్రామపంచాయతీ 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించిన రూ.3లక్షలతో చేపట్టిన డైరెక్ట్ పంపింగ్ నిర్మాణానికి గురువారం ఉమాదేవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం నుంచి కాలనీకి నీటిసరఫరా కష్టంగా మారిందని, దాంతో పైప్‌లైన్‌కు అనుసంధానం చేసి మంచినీరు అందించేందుకు డైరెక్ట్ పంపింగ్ సిస్టాన్ని ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఈ నెల 12న పంచాయతీ నిధులు రూ.4లక్షలతో చేపట్టిన పైప్‌లైన్ నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. దీంతో కాలనీ ప్రజలకు ప్రధాన సమస్య తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి పిఎస్ కోటేశ్వరరావు, ఎంపిటిసి సభ్యురాలు తోట రత్నకుమారి, పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సూర్య, గ్రామ టిడిపి అధ్యక్షుడు చింతా శ్రీనివాసరావు(రాజా), నక్కా అంజయ్య, ఎండి జానీ, బుడా, వి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.