కృష్ణ

ముడ మాస్టర్ ప్లాన్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 27: మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడ) మాస్టర్ ప్లాన్ తయారీకి టెండర్లు దాఖలు చేసిన సంస్థల ప్రతినిధులు గురువారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. మాస్టర్ ప్లాన్ తయారీకి న్యూఢిల్లీకి చెందిన రాయల్ హాస్కానింగ్, లీ అసోసియేట్స్, హైదరాబాద్‌కు చెందిన ఆర్‌వి అసోసియేట్స్, అహ్మదాబాద్‌కు చెందిన సాయి కన్సల్టెన్సీలు టెండర్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సదరు సంస్థల ప్రతినిధులు మాస్టర్ ప్లాన్ తయారీపై కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ముడ ఇవాల్యుయేషన్ కమిటీ ముందు తమ సంస్థల అనుభవాలను వివరించారు. ఇప్పటి వరకు వారు చేపట్టిన ప్రాజెక్టుల వివరాలతో ప్రజంటేషన్ ఇచ్చారు. అయితే టెక్నికల్ బిడ్స్‌ను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ప్లానింగ్ అధికారి శిల్ప, డిటిసిపి జెడి లక్ష్మణరావు, డిటిసిపి ఒఎస్‌డి విద్యుల్లత, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, రాష్ట్ర విద్య వౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఇఇ నరసింహమూర్తి పాల్గొన్నారు.

పవర్ గ్రిడ్ విద్యుత్ లైన్ నిర్మాణ సమస్యపై మంత్రి ఉమాకు రైతుల వినతి
నందిగామ, ఏప్రిల్ 27: పవర్ గ్రిడ్ విద్యుత్ లైన్ నిర్మాణం వల్ల నష్టపోతున్న రైతాంగానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని జిల్లా తెలుగురైతు ఉపాధ్యక్షుడు అమ్మినేని జ్వాలాప్రసాద్ గురువారం తెలిపారు. కోర్టువారు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ కాపీని మంత్రి ఉమామహేశ్వరరావుకు అందజేసి సమస్యను వివరించినట్లు తెలిపారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా పవర్ గ్రిడ్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వివరించామన్నారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి ఉమామహేశ్వరరావు సంబంధిత శాఖ ఉన్నతాధికారి అజయ్ జైన్‌తో ఫోన్‌లో మాట్లాడారన్నారు. సోమవారం ఎమ్మెల్యే, రైతు నాయకులు, పవర్ గ్రిడ్ అధికారులు కూర్చుని చర్చించి రైతులకు అందవలసిన నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉమామహేశ్వరరావు ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, పూర్ణ, ముక్కపాటి మహేంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.

పూర్తి స్థాయిలో గ్రామాల అభివృద్ధికి పిఆర్ మంత్రి లోకేష్ ప్రణాళికలు
పశ్చిమ కృష్ణా నియోజకవర్గాలకు తొలి ప్రాధాన్యత
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వెల్లడి
జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 27: గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కృతనిశ్చయంతో ఉన్నారని, దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గన్నవరం నియోజకవర్గాలను మొదటి ప్రాధాన్యతక్రమంలో అభివృద్ధి పరిచేందుకు నిర్ణయించారని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తెలిపారు. గురువారం సాయంత్రం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, పార్టీ నేతలతో కలిసి విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. 5వేల జనాభా కల్గిన గ్రామ పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుట, వంద శాతం ఎల్‌ఇడి బల్పులతో విద్యుత్ సౌకర్యం, పూర్తి స్థాయిలో ప్రజలకు మంచినీటి సరఫరా, సిసి రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం, అవసరమైన గ్రామ పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణం, వంద శాతం ఎల్‌పిజి గ్యాస్ సరఫరా, క్రీడా మైదానాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, పారిశుద్ధ్య ప్రత్యేక కార్యాచరణ ద్వారా తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు, వ్యర్థ పదార్ధాలతో వర్మికంపోస్టు తయారు చేసి రైతులకు అందించడం, మార్కెటింగ్ చేయడం తదితర అంశాలు త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పధకం అమలుకు ఎన్‌ఆర్‌ఇజిఎస్ పధకాన్ని అనుసంధానం చేయడం జరుగుతుందని, గత మార్చి నెలలో తాను అసెంబ్లీలో చెప్పిన అంశాలు మంత్రి లోకేష్ పరిగణలోకి తీసుకొని అమలు చేసేందుకు నిర్ణయించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయి పారిశుద్ధ్యం అమలు చేసి ఎక్కడా చెత్తచెదారం లేకుండా స్వచ్చ్భారత్, స్వచ్చాంధ్రప్రదేశ్ సాధనకు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు కలిసి రావాలన్నారు. నీరు - ప్రగతి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలుపర్చేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల పరిపాలనను బట్టి ప్రభుత్వం గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందని, అదే విధంగా వాటిని ప్రోత్సహించేందుకు బహుమతులు కూడా ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందన్నారు. ఉపగ్రహం ద్వారా జగ్గయ్యపేట మండలంలో చెక్ డ్యామ్‌లు నిర్మించేందుకు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందని ఎంపిడిఒ ప్రసాద్ ఎమ్మెల్యేకి తెలిపారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ పధకం ద్వారా 53 మైనర్ చెక్‌డ్యామ్‌లు, ఇరిగేషన్ ద్వారా 5మీడియం, 5 మేజర్ చెక్‌డ్యామ్‌లు నిర్మించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కల్యాణ్‌కుమార్, ఎంపిపి తాళ్లూరి పార్వతి, జడ్‌పిటిసి అమ్మనబోయిన రాణి, జిల్లా సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు ముల్లంగి రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కట్టా నర్శింహరావు, నీటి సంఘం అధ్యక్షుడు యానాల గోపీచంద్, రావూరి శ్రీను, మాజీ జడ్‌పిటిసి భూక్యా శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.