కృష్ణ

గ్రామాల్లో మంచినీటి ఎద్దడి రానివ్వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 27: గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మండలంలో మంచినీటి సరఫరాపై గురువారం ఆయన తన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో మంచినీటి సమస్య ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోన గ్రామంలో మంచినీటి చెరువుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. చిన్నాపురం గ్రామంలో మెగా రక్షిత మంచినీటి పథకం నిర్మాణ పనుల ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రుద్రవరం గ్రామంలో రెండు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నా ప్రజలకు సరిపోవడం లేదన్నారు. కొత్త కాలనీలో 100 గృహాలు పెరిగిన నేపథ్యంలో ప్రజల అవసరాల మేరకు నీరు సరఫరా చేసేలా చూడాలన్నారు. తాళ్లపాలెం, కానూరు గ్రామాల్లో కూడా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా నీటిని సరఫార చేయాలన్నారు. మేలో కాలువలకు నీరు విడుదల అవుతుందన్నారు. ఆ సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి శివారు ప్రాంతాలకు నీరు చేరేలా చూడాలన్నారు. అవసరమైన చోట్ల మోటార్లతో నీరు లిఫ్టు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బొర్రపోతుపాలెం, బుద్ధాలపాలెం గ్రామాల్లో మంజూరైన మంచినీటి పథకాల పైప్‌లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గృహ నిర్మాణంపై మంత్రి రవీంద్ర సమీక్షించారు. మండలానికి 650 గృహాలు, పట్టణానికి 1850 గృహాలు మంజూరయ్యాయన్నారు. అయితే మండలంలో 270, పట్టణంలో 500 గృహాలు మాత్రమే నిర్మాణాలు ప్రారంభం కావడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. లబ్ధిదారులను చైతన్యపర్చి నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. నీరు-చెట్టు కింద పనులు చేపట్టాలన్నారు. ఆధునికీకరణ కింద కల్వర్టు పనులు పూర్తి చేయాలన్నారు. డ్రైనేజీలు వీడ్ తొలగింపు పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షుడు కుంచే దుర్గాప్రసాద్ (నాని), ఎంపిడివో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ నారదముని, పిఆర్ ఎఇ జవహర్, ఆర్‌అండ్‌బి ఎఇ కామేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుయస్, విద్యుత్, హౌసింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు.