కృష్ణ

జిల్లాలో 200 మసీదులకు 2.14 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం/జి.కొండూరు, ఏప్రిల్ 28: జిల్లాలో 200 మసీదుల మరమ్మతులకు 2.14 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన మైలవరం నియోజకవర్గంలో 28 మసీదులకు మంజూరైన 29.12లక్షల నిధులకు సంబంధించిన చెక్కులను ఉపసర్పంచ్ షహానాబేగం, ముస్లిం నేతలకు అందించారు. గడ్డమణుగు మసీదుకు నిధులు మంజూరు చేసిన పత్రాలను స్థానిక నాయకులకు అందచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జి కొండూరు, విజయవాడ రూరల్ మండలాలలోని మసీదులకు ఒక్కొక్కదానికి లక్షా నాలుగు వేల రూపాయల చొప్పున ఆయా ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. మంజూరైన ఈనిధులతో ఆయా మసీదుల మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. మసీదుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయించిన మంత్రి దేవినేని ఉమను విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో ముస్లిం నేతలు కరీముల్లా, షహానాబేగం, జి కొండూరు నేతలు ఉయ్యూరు నరసింహారావు తదితరులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

భక్తిసంద్రంలో ముంచెత్తిన
త్యాగరాజ కీర్తనలు
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 28: స్థానిక బుట్టాయిపేట శ్రీ వల్లభాంబ సమేత శ్రీ మహాగణపతి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీ త్యాగరాజ స్వామి 250వ జయంత్యుత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రముఖ సంగీత కళాకారులు ఆలపించిన త్యాగరాజ స్వామి కీర్తనలు భక్తులను భక్తిసంద్రంలో ముంచెత్తాయి. కామేశ్వరి వౌనిక, శ్రీవిద్య (మొదలి సిస్టర్స్), వేమూరి నాగలక్ష్మి, డి సాయికీర్తన, గాయత్రి, విజయ భాను, భవాని, మాధవి, వరలక్ష్మి, కాజ కమలా రామలింగేశ్వరరావులు త్యాగరాజ స్వామి కీర్తనలు ఆలపించారు. త్యాగరాజ స్వామి విరచిత శ్రీరంగం పంచరత్నాలు బృంద గానం జరిగింది. సింగరాజు కల్యాణి, విశ్వనాధ శాంతకుమారి, ఎల్ విజయలక్ష్మి, కాళీపట్నం ఉమా కార్యక్రమాలను నిర్వహించారు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు
*ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
పెనుగంచిప్రోలు, ఏప్రిల్ 28: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతొందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. పెనుగంచిప్రోలు, లింగగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి పథకాలను శుక్రవారం ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని లింగగూడెం గ్రామంలో 9 లక్షలతో ఏర్పాటు చేయనున్న సిసి రోడ్డు, 15లక్షలతో ఏర్పాటు చేయనున్న పైపులైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేసారు. అలాగే పెనుగంచిప్రోలు గ్రామంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బడికి పోదాం రా అనే కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వాకింగ్ ట్రాక్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దీపం పథకం కింద మండలానికి మంజూరైన 800 గ్యాస్ కనెక్షన్‌లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుగంచిప్రోలు మండలాన్ని సమైక్య మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జడ్‌పిటిసి గింజుపల్లి శ్రీదేవి, మండల తెదేపా అధ్యక్షుడు చింతల సీతారామయ్య, తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ కర్ల వెంకట నారాయణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నల్లపునేని సుజాత, మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్‌బాబు, తెదేపా నేతలు ఊట్ల నాగేశ్వరరావు, కాకాని హరిబాబు, పిహెచ్‌సి అభివృద్ధి కమిటీ చైర్మన్ చుంచు రమేష్‌బాబు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆళ్ల రాంబాబు, శ్రీవాణి, లింగగూడెం తెదేపా నేతలు మురుకుట్ల రామారావు, బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.