కృష్ణ

ఏడాదిలోగా చింతలపూడి ద్వారా పశ్చిమ కృష్ణాకు గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 28: వచ్చే ఏడాదిలోగా చింతలపూడి ఎత్తిపోతల పథ కం ద్వారా పశ్చిమ కృష్ణాలోని ఏడు ల క్షల ఎకరాల మెట్ట పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరందించి తెలుగుదేశం ప్రభుత్వం సత్తా చాటుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మైలవరం, రెడ్డిగూడెం మండలాల టిడిపి కార్యకర్తల సమావేశం స్థానిక శ్రీ సాయి బాబా కల్యాణ మం డపంలో శుక్రవారం జరిగింది. ఈసమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రజాసంక్షేమానికి టిడిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రంలో నదుల అనుసంధానం, ప్రాజెక్టుల సకాలంలో నిర్మాణంతో సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటితో కృష్ణా డెల్టాలోని ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టును సాగుచేసి కోట్లాది రూపాయల విలువైన పంటను రక్షించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. పట్టిసీమ దండగ అని, దోచుకునేందుకే ఈపథకం అని విపక్షాలు తమపై అనేక ఆరోపణలు చేసినా మడమ తిప్పకుండా రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చసి విపక్షాల నోళ్ళు మూయించామన్నారు. పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా లేనట్లేనన్నారు. అదేవిధంగా పశ్చిమ కృష్ణా మెట్ట ప్రాంతంలో కేవలం వర్షాలపైనే ఆధారపడి పంటలు పండించే రైతాంగం ఆందోళనను దృష్టిలో ఉంచుకుని చారిత్రాత్మకమైన చింతలపూడి, గుడ్డిగూడెం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఎనె్నస్పీ ఎడమ కాలువ పరిధిలోని 117వ కిలోమీటరు వరకూ రప్పించి అక్కడి నుండి మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, నందిగామ నియోజకవర్గాలలోని ఏడు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. గతంలో తాను చేసిన పాద యాత్రల కారణంగా రైతుల కష్టాలు, సాగునీటి అవసరాలపై పూర్తిగా అవగాహన పెరిగిందన్నారు. ఈప్రాజెక్టుకు సంబంధించి పనులు ప్రారంభమైనాయని, ఏడాది తిరగకుండానే చింతలపూడి లిఫ్ట్ ద్వారా గోదావరి నీటిని రప్పించి విపక్షాల నోళ్ళు మూయిస్తామని హర్షధ్వానాల మధ్య మంత్రి ఉమ ప్రకటించారు. అంతేగాక గోదావరి నీటితో పశ్చిమకృష్ణాలోని కలువలు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలలో నీటిని పారిస్తానన్నారు. విభజన అనంతరం రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల అప్పున్నప్పటికీ చంద్రబాబు నాయుడు దక్షతతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో చేస్తున్న అభివృద్ధిని కార్యకర్తలు, నేతలు గర్వంగా ప్రజలకు వివరించాలన్నారు. రెండేళ్ళపాటు అధికారులు, ఇంజనీర్లు ఎంతో శ్రమించి ఎపి వరుణ యాప్‌ను రూపొందించారని స్మార్ట్ఫోన్‌లో దీనిని డౌన్‌లోడ్ చేసుకుంటే వాతావరణ పరిస్థితులు, తేమ శాతం, గాలి వేగం వంటి విషయాలు తెలుస్తాయని దీని ద్వారా రైతులు పనులు చేపట్టవచ్చన్నారు. నందిగామలో స్వర్గీయ మాజీ మంత్రి దేవినేని వెంకట రమణ మానస పుత్రిక వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేయించటానికి నాలుగేళ్ళు పట్టిందని 18 కోట్లతో దానిని నిర్మిస్తే నేడు ఆ ప్రాంతంలోని పంటలన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయన్నారు. గతంలో నాయకులను, మంత్రులను కలవాలంటే, పనులు చేయించుకోవాలంటే సామాన్య కార్యకర్త ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేదని ప్రస్తుతం తామే పనులు చేయటానికి తలుపులు తెరిచి ఉంటున్నామన్నారు. పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, పదవులు రాలేదని నిరుత్సాహ పడవద్దన్నారు. పని చేసే కార్యకర్తకు పదవులతో పని లేదన్నారు. పదవులు పొందిన తాము గొప్పోళ్ళం కాదని, తనకన్నా గొప్పోళ్ళున్నారన్నారు. తాము ప్రజాప్రతినిధులం కాదని ప్రజలకు సేవకులమన్నారు. కార్యకర్తలు, నేతలు గ్రామాలలో మనస్పర్థలు వీడి ఐక్యంగా పని చేస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతోందన్నారు. ఈసమావేశంలో పార్టీ పరిశీలకులు యర్రాకుల శ్రీనివాసరావు, వజీర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎంపిపిలు లక్ష్మి, నారాయణరావు, జడ్పీటిసి రాము, సర్పంచ్ కృష్ణవేణి, నేతలు కోమటి సుధాకర్, విజయబాబు, పోతురాజు, నాగేశ్వరరెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిలికానాంధ్ర వైద్యాలయానికి ఆటో వర్కర్ల విరాళం
కూచిపూడి, ఏప్రిల్ 28: స్థానిక పసుమర్తివారి ధర్మచెరువులో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రూ.37 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల సంజీవని మల్టీ వైద్యాలయం నిర్మాణానికి శుక్రవారం స్థానిక శ్రీ సిద్ధేంద్ర ఆటో వర్కర్స్ యూనియన్ రూ.35 వేల విరాళాన్ని చైర్మన్ కూచిభొట్ల ఆనంద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ప్రవాస భారతీయుల సహకారంతో నిర్మిస్తున్న వైద్యాలయంలో తక్కువ ఖర్చుతో ఉత్తమ వైద్య పరీక్షలు, వైద్య సేవల ద్వారా గ్రామీణ ప్రజలకు అదనపు భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అమెరికాలోని గ్రేట్ కాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సిద్ధేంద్ర కూచిపూడి కళాక్షేత్రంలో ఈ నెల 30 ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్స్‌రేలు, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. తమ ఆస్పత్రి నిర్మాణంపై ఆసక్తితో ఆటో వర్కర్లు రూ.37 వేలు అందజేయడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్ అధ్యక్షుడు మీర్జా అమానత్ ఆలి, కార్యదర్శి వీరంకి సాయి, దినేష్, కోశాధికారి గురివిందపల్లి అశోక్, మాజీ సర్పంచ్ పెనమూడి కాశీవిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందుగా ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు, జయహో కూచిపూడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.