కృష్ణ

ఖరీఫ్ ప్రణాళికలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 28: డెల్టాలో ఖరీఫ్ సాగు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గత యేడాది కన్నా ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరగనుంది. 3లక్షల 43వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. గత ఏడాది 3.01లక్షల హెక్టార్లలో మాత్రమే ఖరీఫ్ సాగు జరిగింది. ఈ ఏడాది దీన్ని 42వేల హెక్టార్లకు పెంచడం గమనార్హం. సాగు విస్తీర్ణంతో పాటు పంట రుణాల లక్ష్యాన్ని కూడా భారీగానే పెంచారు. 2016-17 సంవత్సరంలో రూ.4వేల 785 కోట్లు పంట రుణాలు లక్ష్యం కాగా ఈ ఏడాది దాన్ని రూ.5వేల 350కోట్లకు పెంచారు. నూరు శాతం పంట రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ఎద్దడి కారణంగా గత కొనే్నళ్లుగా ఖరీఫ్ సాగు రైతులకు నష్టాలను తెచ్చి పెడుతోంది. ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొంతమంది రైతులైతే సాగునే వదులుకున్న పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ప్రతి యేడాది మాదిరిగానే వ్యవసాయ శాఖ ప్రణాళికలు తయారు చేసినా ఏ మేర సాగు జరుగుతుందనేది ప్రశ్నార్ధకం. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3.45లక్షల హెక్టార్లు ఉంది. 3.01లక్షల హెక్టార్ల మాత్రమే సాగు జరుగుతుంది. 2.45లక్షల హెక్టార్లలో వరి పంట సాగు జరగాల్సి ఉండగా గత ఏడాది 2.15లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. అలాగే పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 58వేల హెక్టార్లయితే 37వేల హెక్టార్లలో సాగు జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం జూన్‌లో ఖరీఫ్ పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ సమగ్ర ప్రణాళికలు తయారు చేశారు. ఈ ప్రణాళికలపై మే 15వతేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. సాగు విస్తీర్ణం, సాగయ్యే పంటలు, విత్తనాలు, ఎరువులు తదితర అంశాలపై గ్రామసభల్లో రైతులకు అవగాహన కల్పించనున్నారు.