కృష్ణ

పన్నులపైనే ఆధారపడకుండా ప్రత్యమ్నాయ ఆదాయ వనరులు మెరుగుపర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 19: స్థానిక సంస్థలు ఆర్ధిక బలోపేతానికి ప్రత్యమ్నాయ వనరులను మెరుగుపర్చుకోవాలని, కేవలం ప్రజల నుంచి వసూలు చేసే పన్నులపైనే ఆధారపడకుండా ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నగరంలోని విఎంసికి చెందిన ఎన్‌టిఆర్ షాపింగ్ కాంప్లెక్సుకు 9 కోట్ల 97 లక్షల వ్యయంతో చేపట్టిన రెండో అంతస్థు నిర్మాణానికి మంగళవారం ఉదయం శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ మాట్లాడుతూ పెరుగుతున్న వాణిజ్య అవసరాలకనుగుణంగా విఎంసికి చెందిన స్థలాలు వ్యాపార దుకాణాలు, మల్టిప్లెక్స్ సముదాయాల నిర్మాణాలు చేపట్టి తద్వారా ఆదాయం పొందాలని హితవు పలికారు. రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ది చెందుతున్న ప్రస్తుత తరుణంలో విజయవాడ వ్యాపారానికి కూడా ముఖ్య కేంద్రంగానే విరాజిల్లుతుందన్నారు. నగర ప్రజలకు అవసరమైన వౌళిక సదుపాయాల కల్పనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విజయవాడ నగరంలో వందలాది కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ, యుజిడి, గ్రీనరీ పనులు చేపడుతున్న విషయం తెలిసిందేనని, త్వరలోనే స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టును కార్యరూపంలోకి తెస్తున్నామన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా సోలార్ శక్తితో నడుస్తున్న కార్పొరేషన్ కార్యాలయం ఒక్క విఎంసియేనని తెలిపారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ విఎంసి షాపింగ్ కాంప్లెక్సులను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని హితవుపలికారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో 100 షాపులతోపాటు మూడో అంతస్థులో మినీ హాల్, మరికొన్ని దుకాణాలను నిర్మిస్తున్నామన్నారు. వీటి నిర్మాణంతో ఎన్‌టిఆర్ కాంప్లెక్సు ఆదాయం సుమారు 20 లక్షలకు పెరుగుతుందన్నారు. విఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్‌తో నెలకు 20 లక్షల రూపాయల విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం పొందామన్నారు. గతంలో 60లక్షలు చెల్లించే బిల్లు ప్రస్తుతం 40 లక్షలు చెల్లిస్తున్నామన్నారు. త్వరలోనే అజిత్‌సింగ్‌నగర్, రామలింగేశ్వరనగర్ సూయజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లతోపాటు హెడ్ వాటర్ వాటర్ వర్క్స్‌లో కూడా సోలార్ పవర్ ప్రవేశపెడతామన్నారు. విఎంసి ప్రధాన కార్యాలయ ఆవరణలో కార్యాలయ అవసరాల నిమిత్తం 8 అంతస్థుల భవనాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు. కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ ప్రస్తుతం చేపట్టిన నిర్మాణ పనులు సంవత్సర కాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు.