కృష్ణ

జిల్లాలో ప్రత్యేకంగా ‘బడిబాట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 29: బడి ఈడు పిల్లలు బడిలో ఉండేలా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ బి లక్ష్మీకాంతం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ అధికారులు అన్ని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించేలా ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నేటివరకు 9969 మంది ప్రాథమిక పాఠశాలలు, 5393 మంది ప్రాథమికోన్నత పాఠశాలలు, 7475 మంది ఉన్నత పాఠశాలలకు చెందిన పిల్లలను గుర్తించామన్నారు. వీరిని ఆయా పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అందరూ బడిలో ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తల్లిదండ్రులు వినియోగించుకుని నిరక్షరాస్యులు లేని సమాజాన్ని రూపొందించటంలో తోడ్పడాలని కలెక్టర్ కోరారు. డ్రాప్ అవుట్ విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నారో సంబంధిత విద్యాశాఖ ముందుగానే గుర్తించి పాఠశాలల పునఃప్రారంభం నాటికి వారిని బడిలో చేర్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.