కృష్ణ

విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, ఏప్రిల్ 29: మండల పరిధిలోని పెదకళ్ళేపల్లి శివారు చినమాలపల్లి గ్రామంలో శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 11.25ని.లకు పెదపులిపాక పీఠాధిపతులు శ్రీ వాసుదేవానందగిరి స్వామీజి ఆధ్వర్యంలో ప్రతిష్ఠ జరిగింది. శ్రీకాకుళం జిల్లా రామలింగేశ్వర పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి, శ్రీ నారాయణ ఆశ్రమ అధిపతి కంద దేవానంద గిరి స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూజివీడు కామేశ్వరిదేవి పీఠం వ్వవస్థాపకుడు ఆదిత్యానంద భారతీ స్వామిజీ, తాడేపల్లి హరిహర పీఠాధిపతి హరేశ్వరానంద స్వామీజీ, కళ్లేపల్లి కాంతి కేంద్రం సేవా ట్రస్టు నిర్వహకులు రాజర్షి విశ్వానంద స్వామీజీ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోట సురేష్‌బాబు, గ్రామ సర్పంచ్ అర్జా వెంకట సుబ్బారావు, మండల పరిషత్ అధ్యక్షుడు ఎం జయలక్ష్మి, ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్య ప్రసాద్, గ్రామస్థులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ్భగవద్రామానుజాచార్య
సహస్రాబ్ది మహోత్సవాలు ప్రారంభం
గుడివాడ, ఏప్రిల్ 29: స్థానిక జగన్నాథపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ్భగవద్రామానుజాచార్య సహస్రాబ్ది జయంతి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్థానిక మార్కెట్ సెంటర్లోని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఇంటి దగ్గర నుండి శోభాయాత్ర నిర్వహించారు. వందలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. కోలాటాలు, నృత్య ప్రదర్శనలు, భజన కార్యక్రమాలు, వాయిద్యాలతో సందడి చేశారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు, ఉత్సవ నిర్వాహకుడు చలసాని ఇందిరా రమణారావు, శ్రీమాన్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి స్వామి, దేవాదాయశాఖ డివిజన్ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామినేని వెంకటకృష్ణ, గోష్టి సభ్యులు బెజవాడ సుబ్బరావమ్మ(చంటి) తదితరులు పాల్గొన్నారు.

రెండు జిల్లాలో స్థాయిలో క్రికెట్ పోటీలు ప్రారంభం

ముసునూరు, ఏప్రిల్ 29: మండలంలోని వేల్పుచర్ల గ్రామంలో ఫ్రెండ్లి క్రికెట్ టీమ్ ఆధ్వర్యంలో రెండు జిల్లాలో స్థాయిలో క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను టిడిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లూరి రమేష్ ప్రారంభించారు. శనివారం నాటికి 20 టీమ్‌లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈపోటీలను రెండు జిల్లాల స్థాయిలోని క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబర్చబోతున్నారు. గెలుపొందిన జట్లను మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.