కృష్ణ

ఎక్సైజ్‌ను ప్రభుత్వ ఆదాయ వనరుగా చూడటంలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, ఏప్రిల్ 29: ఎక్సైజ్ శాఖను గతంలో మాదిరిగా ప్రభుత్వ ఆదాయ వనరుగా చూడటంలేదని ఆ శాఖ మంత్రి శ్యామ్యూల్ జవహర్ అన్నారు. స్థానిక ఎన్‌ఎస్‌పి కాలనీ సమీపంలో నూతనంగా ప్రారంభించిన ఎపిటిఎఫ్ భవనాన్ని శనివారం సా యంత్రం ఎమ్మెల్యే తంగిరాల సౌ మ్యతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులను అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ శాఖలో అవినీతిని అరికట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నామన్నారు. వివిధ రకాల టా క్స్‌లు పోగా ఎక్సైజ్ శాఖకు రూ. 3900కోట్లు మాత్రమే ఆదాయంగా వ స్తుందని, దీనిలోనే సిబ్బంది, అధికారు లు జీత భత్యాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మద్యం బెల్ట్ షాపులను నియంత్రించడంతో పాటు నూతన ఎక్సైజ్, బార్ పాలసీలను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఎంఆర్‌పి ధరలకే మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడినా, మద్యం షాపుల వారు నిబంధనలు అతిక్రమించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా మద్యం మాఫియా అంటూ ఏమిలేదని, జియో ట్యాగింగ్ ద్వారా అక్రమ మద్యం అమ్మకాలు పూర్తిగా నిరోధించడం జరిగిందన్నారు. మద్యం వాసన కూడా పడని తాను ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటూ చమత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, ఎపిటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

తోట్లవల్లూరులో రూ.6.37 కోట్లతో
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలు
* సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న తమిళనాడు ఇంజనీర్లు
తోట్లవల్లూరు, ఏప్రిల్ 29: మండల కేంద్రమైన తోట్లవల్లూరులో రూ.6.37 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి రూపకల్పన జరుగుతోందని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు మండల పిఆర్‌ఏఈ వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. మేజర్ డ్రైన్‌తో కలుపుకుని గ్రామంలోని అంతర్గత సిసి రహదారికి ఇరువైపులా 25.5 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరిగేలా అంచనాలు తయారు చేశామని అన్నారు. రాష్ట్రంలో 5వేల జనాభా కలిగిన ప్రతి గ్రామానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రభుత్వ కృషికి తోడు తోట్లవల్లూరును దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్త పొట్లూరి రాజమోహన్ సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మ్యాప్‌ను సిద్ధం చేయమని తమిళనాడులోని ఓసూరుకు చెందిన ఎంకెఎస్ మార్కెటింగ్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి సంతానకుమార్, తైలప్పన్ అనే ఇద్దరు ఇంజనీర్లను రాజమోహన్ శనివారం తోట్లవల్లూరు పంపించారు. వారు ముందుగా మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి పిఆర్‌ఏఈ వెంకటేశ్వరరావుని కలిసి చర్చించారు. ఇక్కడ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడితే పొట్లూరి రాజమోహన్ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంజనీర్లు తెలిపారు. అనంతరం గ్రామసర్పంచ్ చిరుమామిళ్ళ ఉమాదేవి, తహశీల్దార్ జి భద్రు, రాష్ట్ర ఉపాధిహామి మండలి డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి, ఏఈ వెంకటేశ్వరరావు, సంతానకుమార్, తైలప్పన్ గ్రామంలోని మేజర్ డ్రైన్ స్థితిగతులను పరిశీలించారు. ఇంకా గ్రామ టిడిపి అధ్యక్షుడు చింతా శ్రీనివాసరావు(రాజా), మాజీ అధ్యక్షుడు నెక్కలపూడి మురళీ వీరివెంట ఉన్నారు. రాష్ట్ర ఉపాధిహామి మండలి డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతు పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా లోకేష్ 5వేల జనాభా ఉన్న గ్రామాలన్నింటికీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించాలని, రాష్ట్రంలోని 13104 గ్రామపంచాయతీలలో వీధిలైట్లకు ఎల్‌ఈడి బల్బులు వేయాలని చారిత్రక నిర్ణయం తీసుకున్నరాని చెప్పారు.
టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ స్టౌ ప్రమాదం
* పది మందికి గాయాలు
నందిగామ, ఏప్రిల్ 29: స్థానిక గాంధీ సెంటర్ సమీపంలో ఒక టిఫిన్ సెంటర్‌లో సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయి పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడటంతో పది మంది గాయపడ్డారు. స్థానిక గాంధీ సెంటర్ సమీపంలో గల హనుమాన్ టిఫిన్ సెంటర్‌లో శనివారం ఉదయం సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయి మంటలు ఎగసి పడటంతో పాటు టిఫిన్ సెంటర్ వరండాలోని పైకప్పు, స్టౌ గాలిలోకి ఎగిరిపడ్డాయి. కళాయిలో మరుగుతున్న నూనె వెదజల్లడంతో టిఫిన్ సెంటర్‌లో పని చేస్తున్న కార్మికులతో పాటు టిఫిన్ చేయడానికి వెళ్లినవారిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఫైర్ ఆఫీసర్ వి బాస్కరరావు అగ్నిమాపక శకటం, సిబ్బందితో అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తహశీల్దార్ రామకృష్ణ, ఎస్‌ఐ ఏసోబు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తదితర నాయకులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన షేక్ గౌస్, రాఘవరపు సుబ్బారావులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. పసుపులేటి నర్శింహరావు, ముంగి కనకరావువ, పిడతల రోశయ్య, పారి నాగు, పి సత్యనారాయణ, సిహెచ్ చిన వెంకటేశ్వర్లు, ఎం ఉమామహేశ్వరరావు, మంద అప్పమ్మలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన టిఫిన్ సెంటర్‌లో ఐదు కమర్షియల్ సిలిండర్‌లతో పాటు ఆరు డొమెస్టిక్ సిలిండర్‌లు ఉండటాన్ని గుర్తించి అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.