కృష్ణ

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 30: బందరు ఓడరేవు నిర్మాణం దృష్ట్యా ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఏర్పడనున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్ర జాతీయ కళాశాల వేదికగా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండల పరిధిలోని గోకవరం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సమావేశంలో గ్రామానికి చెందిన రైతులు 32 ఎకరాల భూమిని ఓడరేవు నిర్మాణానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చి అంగీకార పత్రాలను మంత్రి రవీంద్ర, ఎంపి కొనకళ్ల నారాయణరావులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులను అభినందించారు. ఓడరేవు, పారిశ్రామిక వాడ ద్వారా ఈ ప్రాంత యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. పోర్టుల అభివృద్ధితోనే కుగ్రామంగా ఉండే సింగపూర్ ప్రపంచ దేశాల్లో మేటిగా నిలిచిందన్నారు. 15వ శతాబ్దంలో మన దేశంలో గుజరాత్, బందరు పోర్టులు మాత్రమే ఉన్నాయని, ఈ పోర్టుల కేంద్రంగానే వర్తక, వాణిజ్యాలు జరిగాయన్నారు. బందరు ఓడరేవుకు మళ్లీ మంచి రోజులు రానున్నట్లు చెప్పారు. త్వరలోనే పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ భూసమీకరణ పట్ల రైతుల్లో సానుకూలత వచ్చిందన్నారు. తుది దశలో భూములు ఇవ్వమని అల్లర్లు చేసిన వారే నేడు స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, తహశీల్దార్ నారదముని, టిడిపి మండల అధ్యక్షుడు కుంచే నాని తదితరులు పాల్గొన్నారు.