కృష్ణ

ఉపాధి హామీ పనుల్లో జిల్లా ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: జిల్లాలో లక్షా 35 వేల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారని, దేశంలోనే ఇది రికార్డని, చరిత్ర అని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 933 గ్రామ పంచాయతీలలో నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంటకుంటలు, చెరువులలో పూడికతీత సేద్యపు నీటిగుంటలు, వర్మికంపోస్ట్ పిట్ నిర్మాణం, చెక్ డ్యాం పూడిక తీసి లోతు చేయటంతోపాటు మరమ్మతు పనులు చేయటం, తాగునీటి ఇరిగేషన్ ట్యాంకు పునరుద్ధరణ, కొత్త పంట కాలువలు తవ్వటం వంటి పనులు ఉపాధి హామీలో ఉద్యమంలా చేపడుతున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత వారం రోజుల నుండి తీసుకున్న చర్యల వల్ల ప్రగతి సాధ్యపడిందన్నారు. ముఖ్యమంత్రి మన జిల్లాను ప్రత్యేకంగా ప్రశంసించారన్నారు. రానున్న రోజుల్లో లక్షా 50 వేలకు పైగా ఉపాధి కూలీలకు పని కల్పించేలా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో రోజుకు కనీసం మూడు చొప్పున రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఉపాధి కూలీలతో పనులు చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కరవు రహిత జిల్లాగా తీర్చిదిద్ది ప్రతి నీటిచుక్కను భూమిలోకి ఇంకించి భూగర్భ జలమట్టాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు.