కృష్ణ

శ్రీకృష్ణాశ్రమంలో శ్రీ వైకుంఠనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మే 2: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ వైకుంఠనాథ స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారికి ముముక్షుజన మహాపీఠాధిపతులు ముత్తీవి సీతారాం గురుదేవుల పర్యవేక్షణలో గజవడ పూలమాలలు సమర్పించి తమలార్చన నిర్వహించారు. ఆశ్రమంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాం గురుదేవులు భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ముత్తీవి గౌరాకృష్ణ, తుర్లపాటి ఆనంద సాగర్, ఆత్మకూరి లక్ష్మణదాసు పర్యవేక్షణలో యతీంద్ర సేవా సమితి భక్తులు భక్తుల వాసుదేవ నామస్మరణల మధ్య అన్నసమారాధన నిర్వహించారు.

మేకపిల్లలను బలితీసుకుంటున్న గ్రామ సింహాలు
మైలవరం, మే 2: మండలంలోని గణపవరంలో గ్రామ సింహాల స్వైర విహారం ఎక్కువైంది. పర్యవసానంగా గ్రామంలోని మేక పిల్లలు వాటి బారిన పడి బలవుతున్నాయి. దీంతో మేకల కాపరులు కలవరపడుతున్నారు. గడచిన నాలుగైదు రోజులలో గ్రామానికి చెందిన సుమారు 20 మేకపిల్లలను కుక్కలు బలితీసుకున్నాయని కాపరులు వాపోతున్నారు. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పంచాయితీ పాలకవర్గం దృష్టికి, సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోవటం లేదని బాధితులు గోపి, శ్రీనివాసరావు, చిన్నబ్బాయి, జమలయ్యలు ఆరోపించారు. జీవాలను పెంచుకుని జీవనం సాగిస్తున్న తాము గ్రామంలో ఊర కుక్కల కారణంగా తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. చనిపోయిన మేక పిల్లల విలువ సుమారు లక్ష రూపాయల పైబడి ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రతిరోజూ తాము తమ జీవాలను కాపాడుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, అదేవిధంగా పంచాయితీ పాలకవర్గం గ్రామంలోని ఊర కుక్కలను సమూలంగా నిర్మూలించాలని వారు కోరారు.

అప్‌గ్రేడ్ అయిన చినపాండ్రాక
30 పడకల ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలి
బంటుమిల్లి, మే 2: ముప్పై పడకల చినపాండ్రాక ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలని వైద్యుడు డా. యార్లగడ్డ బాల సుబ్రహ్మణ్యం కోరారు. మంగళవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఎన్నిక జరిగింది. కమిటీ చైర్మన్‌గా పడమటి పోతురాజు, సభ్యులుగా బొర్రా కాశీ విశే్వశ్వరరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, ముంతాజ్ బేగం ఎంపికయ్యారు. అనంతరం జరిగిన తొలి సమావేశంలో డా. బాల సుబ్రహ్మణ్యంలో ఆస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ఆస్పత్రి అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైద్య సిబ్బంది ముత్తయ్య, యేసుదాస్ తదితరులు పాల్గొన్నారు.

గణపవరంలో గడపగడపకూ బడిబాట

మైలవరం, మే 2: మండలంలోని గణపవరం గ్రామంలో ఎంపియుపి స్కూల్ హెచ్‌ఎం పి గోపాల్ ఆధ్వర్యంలో గడపగడపకు బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. తొలుత గ్రామంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న పథకాలను తల్లిదండ్రులకు తెలియజేశారు. అనంతరం కమ్యూనిటీ హాలు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిల్లలందరినీ బడిలోకి పంపటం ద్వారా సంపూర్ణ అక్షరాస్యతకు తోడ్పడాలని తల్లిదండ్రులను కోరారు. వెల్వడం స్కూల్‌లో ఐదవ తరగతి పూర్తి చేసిన పిల్లలను 15 మందికి అడ్మిట్ కార్డులు అందించి హైస్కూల్‌కు పంపటం జరుగుతుంతని గోపాల్ తెలిపారు. ఆదేవిధంగా ఎంపియుపి ఆదర్శ పాఠశాలకు 11 మంది పిల్లలను చేర్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం అవసరమనే అభిప్రాయాన్ని తల్లిదండ్రులు తమ పర్యటనలో వెల్లడించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈదిశగా ఆలోచించి ఇంగ్లీష్ మీడియం అమలుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాలకు విద్యార్థులను తరలించేందుకు గ్రామంలో వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని కొందరు తల్లిదండ్రులు కోరారని, దాతలు, ఉన్నతాధికారుల దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో హైస్కూల్ టీచర్లు పి నాగరాజు, సుబ్రమణ్యం కూడా పాల్గొన్నారు.