కృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని పటిష్టం చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మే 2: ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని పటిష్టం చేస్తున్నామని, దీనిలో భాగంగా ఈ నెల 25వ తేదీలోగా బూత్‌స్థాయిలో కమిటీలను నియమిస్తామని రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. మంగళవారం స్థానిక గోపాలరావుపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తల పైనే ఉందన్నారు. పార్టీ బలోపేతానికి అవసరమైన సలహాలు, సూచనలను తీసుకునేందుకు త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. వచ్చే ఆగస్టులో స్వచ్ఛంద సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి ఆయా సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామినేని వెంకటకృష్ణ, నాయకులు చిరువోలు బుచ్చిరాజు, గుత్తికొండ శ్రీరాజబాబు, ఆలమూరి మురళీకృష్ణ, సూరే గాంధీ, జి పద్మినీమహేష్, వలపర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నీటి కేటాయింపులపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలి
* డెల్టా రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా. శ్రీనాథ్

మచిలీపట్నం, మే 2: కృష్ణా డెల్టాకు సాగు, మంచినీటి కేటాయింపులపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డెల్టా రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా. బూరగడ్డ శ్రీనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఫ్యాక్స్ ద్వారా వినతిపత్రం అందజేశారు. నదీ పరివాహక ప్రాంతమైన డెల్టాలో ఏర్పడిన నీటి కష్టాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల్లో ముందు చూపు కొరవడటంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఫలితంగా శివారు ప్రాంతాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. గుక్కెడు నీరు లేక పశు పక్షాదులు సైతం అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీర ప్రాంతంలో ప్రతి కుటుంబానికి సురక్షితమైన మంచినీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికీ నీటి పంపిణీ జరిగేలా గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని నిర్మాణంలో జపాన్, సింగపూర్, చైనా, మలేసియా వంటి దేశాల నుండి ప్రపంచ స్థాయి నిపుణులను తీసుకువస్తున్న ప్రభుత్వం మనకు అన్నం పెట్టే రైతుల విషయంలో ఆ చొరవ ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. తక్కువ వనరులతో అధిక దిగుబడులు సాధిస్తున్న ఆ దేశపు నిపుణులను ఆహ్వానించి మన రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. నదీ జలాలు అరకొరగా ఉన్న సమయంలో సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచినీటిని అందించే డీసాలినేషన్ ప్లాంట్లను ఏర్పాటుతో శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో జిల్లా కేంద్రం మచిలీపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుందని, అందుకు నీటి వనరులు ఎంతో అవసరమన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ముందు చూపుగా వ్యవహరించి జనవనరులపై దృష్టి సారించాలని డా. శ్రీనాథ్ కోరారు.