కృష్ణ

నష్టపరిహారం పెంచితేనే స్థలాలు అందజేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, మే 9: విజయవాడ- తిరువూరు జాతీయ రహదారిలోని రామచంద్రాపురం గ్రామంలో రోడ్డుకు ఇరువైపుల నివాసం ఉంటున్న నిర్వాసితులకు నష్టపరిహారం 4రేట్లు పెంచితేనే స్థలాలు ఖాళీ చేస్తామని అధికారులకు వినతిప్రతం సమర్పించారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో బాధితులతో కలెక్టరు కార్యాలయ అధికారులు త్రిజి అవార్డు విచారణ చేపట్టారు. ఈసందర్భంగా డిటి ఎఎంఎన్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండున్నర రెట్లు మాత్రమే పరిహారం చెల్లించడం జరుగుతుందని, అందుకు అంగీకరించి దస్తావేజులు, ఇతర పత్రాలు అప్పగించినట్లయితే వారం రోజుల్లో తమ బ్యాంక్ ఖాతాల్లో సొమ్ములు జమచేయడం జరుగుతుందన్నారు. అలాకాని పక్షంలో అభ్యంతరాలు తెలిపి జెసి కోర్టులో ఆర్బిట్రేషన్ ఫిటిషన్ దాఖాలు చేసుకుంటే విచారించి రెండు విడతలుగా పెంచిన పరిహారాన్ని చెల్లించడం జరుగుతుందన్నారు. అందుకు అంగీకరించని బాధితులు ప్రభుత్వం చెల్లించే పరిహారం సరిపోదని, నాలుగు రేట్లు పెంచి చెల్లిస్తేనే ఇళ్ళ స్థలాలు ఖాళీ చేస్తామని చెప్పి సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళిపోయారు. అంతకు ముందు సిపిఎం నాయకులు పి అనందరావు, గోపిరాజు, డి రాముడు మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులకు ప్రత్యామ్నయంగా కేటాయించిన పూరిగుట్ట నివేశన స్థలాలకు ఆమోదయోగ్యంగా లేవని, గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి అటవీ ప్రాంతం కావడంతో సరైన రహదారిలేక విషసర్పాలు సంచరిస్తుంటాయని తెలిపి వాపోయారు. బాధితులకు అన్ని సౌకర్యాలు ఉన్న స్థలాలు కేటాయించి అన్ని విధాల ఆదుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం సురేష్‌కుమార్, డిటి డేవిడ్‌రాజు, ఆర్‌ఐ నాగమణి, జూనియర్ అసిస్టెంట్ మణికుమార్ పాల్గొన్నారు.

ఎండతీవ్రతకు ఉపాధి హామీ కూలీ మృతి
జి.కొండూరు, మే 9: ఎండతీవ్రత తట్టుకోలేక ఉపాధి హామీ పథకం కూలీ మృతిచెందిన ఉదంతమిది. మండల పరిధిలోని వెల్లటూరులో ఈసంఘటన మంగళవారం ఉదయం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం వెల్లటూరుకు చెందిన ఆలూరి యేసుదాసు (72) ఉపాధి హామీ పనికి వెళ్ళాడు. ఉదయం 10 గంటల సమయంలో తనకు ఆయాసంగా ఉందని చెప్పి, చెట్టు కింద కూర్చున్నాడు. అంతలోనే అనారోగ్యానికి గురై వాంతులు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాధితుడ్ని మైలవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ అప్పటికే యేసుదాసు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగానే యేసుదాసు మృతి చెందాడని, మంగళవారం వడగాలులు కూడా తక్కువగానే ఉన్నాయని ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఎపిఒ వీరమల్లు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కూలీ పనిచేసే ప్రదేశంలో మృతి చెందినందున, ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి రూ.50వేల నష్టపరిహారం మంజూరుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈవిషయాన్ని ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఉన్నతాధికారులకు తెలియచేశామన్నారు. మృతునికి నలుగురు కుమార్తెలు ఉన్నారు.