కృష్ణ

అవకాశాలను అందిపుచ్చుకుని నైపుణ్యం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 10: నైపుణ్యానికి అవకాశమే హద్దు అని, యువత అవకాశాలను అందిపుచ్చుకుని నైపుణ్యం సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమాధికారి వి శివప్రసాద్ పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో భవిత కార్యక్రమం కింద బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో బందరు, గుడివాడ డివిజన్‌ల పరిధిలోని గిరిజన నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ, ఉపాధి కల్పనపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ సాధనలో సహాయపడేందుకు వివిధ రంగాల్లో నైపుణ్యం పెంపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. పదవ తరగతి లోపు, పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సుమారు 15 రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 21 రంగాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. విజయవాడ, నూజివీడు డివిజన్లకు సంబంధించిన సదస్సును గురువారం విజయవాడ లెనిన్ సెంటరులోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజర్ శాంతి, నాబార్డు కన్సల్టెన్సీ నాబ్‌కాన్స్ జిల్లా కో-ఆర్డినేటర్ జగదీప్ బాబు, ఐ శ్రీనివాస్, సహాయ గిరిజన సంక్షేమాధికారి డి రమేష్, లోన్స్ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.