కృష్ణ

ఊరూరా...’ఉపాధి‘

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 11: ఊరూరా ఉపాధి హామీ పనులతో పల్లెలు కళలాడుతున్నాయి. శ్రమజీవులకు ఉపాధి హామీ పథకం ఒక వరంలా మారింది. వ్యవసాయం పనులు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకమే గ్రామీణులకు ఉపాధి కల్పిస్తోంది. జిల్లాలో రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో సగటున రోజుకు లక్షా 40వేల మంది ఉపాధి పొందుతున్నారు. దీంతో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కలెక్టర్‌గా బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన బాధ్యతల స్వీకరించిన సమయంలో జిల్లాలో సగటున రోజుకు లక్ష మంది ఉపాధి హామీ పనులకు వస్తుండగా వారి సంఖ్యలో అమాంతం 40వేలకు పెంచారు. లక్షా 50వేల మంది ఉపాధి హామీ పనుల్లో పాల్గొడమే లక్ష్యంగా ప్రణాళికలు తయారుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్య సాధనకు మార్గాలు అనే్వషిస్తున్నారు. ఇంకుడు గుంటలు, పంట కుంటలు, పంట సంజీవని, వర్మీ కంపోస్టు యూనిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు తదితర పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ నెలలో 23.27లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. ఆ లక్ష్య సాధనకు డ్వామా అధికారులు పరుగులెడుతున్నారు. గ్రామాల్లో అడిగిందే తడువుగా పనులు కల్పిస్తున్నారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్న సంకల్పంతో డ్వామా అధికారులు ముందుకు సాగుతున్నారు. జిల్లాలో మొత్తం 36వేల 668 శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. వీటిలో 16వేల 879 సంఘాల వారు పనులకు వస్తున్నారు. మిగిలిన సంఘాల వారిని కూడా చైతన్యవంతం చేసి పనులకు వచ్చేలా క్షేత్ర స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉపాధి హామీ పనులపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 8గంటల నుండి 11గంటల మధ్య మాత్రమే పనులు చేస్తున్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా నీడ కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయటంతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. మెడికల్ కిట్లను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రోజుకు రూ.198లు ప్రభుత్వం ఇస్తోంది. వేసవి దృష్ట్యా అదనంగా 30శాతం వేతనాన్ని ఇస్తున్నారు. వికలాంగులకు అదనంగా మరో 10శాతం వేతనంగా ఇస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు సైక్లిస్టుల దుర్మరణం

* ఉయ్యూరులో ప్రైవేట్ బస్సు ఢీకొని బాలుడు, వెల్వడంలో లారీ ఢీకొని పెయంటర్ మృతి
మైలవరం/ ఉయ్యూరు, మే 11: జిల్లాలోని మైలవరం మండలం వెల్వెడంలో, ఉయ్యూరు పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు సైక్లిస్టులు దుర్మరణం పాలయ్యారు. ఒక సంఘటనలో లారీ ఢీకొనగా మరో సంఘటనలో డైమండ్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. వివరాలు ఇలావున్నాయ. మైలవరం మండలంలోని వెల్వడం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఇది. సేకరించిన సమాచారం ప్రకారం వెల్వడం గ్రామానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసరావు(25) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను మైలవరంలో పనులు ముగించుకుని గురువారం రాత్రి సమయంలో సైకిల్‌పై వెల్వడంలోని తన ఇంటికి వెళుతున్నాడు. ఇతను కొద్దిసెపట్లో ఇంటికి వెళ్తాడనుకున్న సమయంలో నూజివీడు నుండి మైలవరం వైపునకు వస్తున్న లారీ శ్రీనివాసరావును ఢీకొట్టింది. శ్రీనివాసరావు లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. శ్రీనివాసరావు తల నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇలావుండగా ఉయ్యూరులో తాండవలక్ష్మి థియేటర్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. స్థానిక సుగాలీ కాలనీకి చెందిన శీలం సుదర్శన్ సైకిల్‌పై వెళుతుండగా విజయవాడ వైపు వెళుతున్న డైమండ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుదర్శన్ బస్సు వెనుక చక్రాల కిందపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.