కృష్ణ

నేతల నీడలో దళారులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మే 11: పాపాలకు వేనవేల దారులున్నాయి, కానీ ధర్మగోపురానికి ఒక్కటే మార్గముంది. ధర్మానికి నిలయమైన బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దుర్మార్గులు, పాపాత్ములు అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు. దుర్గగుడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో ఇప్పటివరకు పాత్రధారులను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. అసలు సూత్రధారుల తుట్టె కదిపితే ఇంకా నిందితుల జాబితా పెరుగుతుందని అంటున్నారు. కనీసం 10మంది అధికారులు జైలుపాలవుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మినీబస్‌పై కండక్టర్‌గా పనిచేసే వ్యక్తి, అతని కుమారుడు, మరో వ్యక్తి అధికారుల అండ లేకుండా నకిలీ ఐడి కార్డులు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వలేరని పోలీసుల విచారణలో తేలింది. కొండమీద అవినీతి ఏ స్థాయిలో ఉందో వన్‌టౌన్ సిఐ దాసరి కాశీవిశ్వనాథ్ వివరించారు. ‘అబ్బో అవెంతో పెద్ద లింకులు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులను బయటకు లాగితే ఎంతోమంది అధికారుల బండారం బయటపడుతుంది. అన్ని ఆధారాలతో ముందుకు వెళుతున్నాం’ అని చెప్పారాయన. ఎఇ, ఎఓకు కూడా తాము లంచాలు ఇచ్చామని, ఈ విషయం కోర్టు ముందు వెల్లడిస్తామని నిందితులు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో బాధితులు ఎంతోమంది ఉన్నారు. పాత్రధారులు వరప్రసాద్, వీరాస్వామిలను పోలీసులు అరెస్టు చేశారే గాని ఇంకా ముందుకు వెళ్లకుండా జిల్లాలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుని ప్రమేయంతో దర్యాప్తు ముందుకు సాగనీకుండా అడ్డు పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీగ లాగితే డొంకంతా కదులుతుంది. గతంలో పనిచేసిన ఉన్నతాధికారులు నేడు ఆత్మరక్షణలో పడ్డారని తెలిసింది. దుర్గగుడిపై అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయనే ఆరోపణలున్నాయి. 50వేల లడ్డూల భూస్థాపితం విషయంలో ఇఓ సూర్యకుమారిపై విజిలెన్స్ దర్యాప్తు మొదలైంది. ఆమెకూడా మొదట్లో కచ్చితంగా వ్యవహరించే అధికారిణి అనిపించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పుష్కరాల సమయంలో దర్శనం టిక్కెట్టు ధరలు పెంచారు. దీంతో ఆమె ఆధ్వర్యంలో అమ్మవారి ఆదాయ వనరులు పెరుగుతాయని అందరూ ఊహించారు. కానీ అక్రమార్కులు పెరిగిన విషయాన్ని ఆమె గ్రహించలేదు. రాజధానిలో దేవాదాయ శాఖకి సంబంధించిన అధికారులు, పాలనా యంత్రాంగం, కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాక ఇంకా దుర్మార్గాలు పెరిగాయి. దేవాదాయ శాఖ మంతి కళ్లుగప్పి జరుగుతున్న ఇలాంటి మోసాల విషయంలో దుర్గమ్మ పరువుప్రతిష్ఠలను స్వయానా తనే కాపాడుకోవాల్సిన స్థితిలో అక్రమార్కులు ఇంద్రకీలాద్రిపై తిష్ట వేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దుర్గగుడికి పాలకవర్గాన్ని నియమించకపోవడం కూడా కొంత నిఘా కొరవడటానికి కారణమయింది. దుకాణాల కేటాయింపులు, ఎన్‌ఎంఆర్‌ల నియామకం, లడ్డూ తయారీదారుల నియామకం, కొబ్బరి చిప్పల వేలం దగ్గర నుండి అమ్మవారి చీరల వేలం వరకు అన్ని శాఖల్లోనూ అవనీతి రాజ్యమేలుతోందనే ఆరోపణలున్నాయి. పూజారుల నియామకం, వారికి డ్యూటీలు కేటాయించే స్థలాలు, కొండపై క్రతువులు నిర్వహించే పురోహితులకు ఐడి కార్డుల జారీ ఇలా అన్నివిధాలుగా డొల్లతమే కన్పిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులకు గాలం వేయడం బట్టబయలుపై రాజకీయ నాయకుల ప్రమేయం తగ్గితే పోలీసులు తమ విధులు తాము స్వచ్ఛందంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం మానుకోలేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా మంత్రి గాని ఈ ఆగడాలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఆసన్నమైందని భక్తులు సూచిస్తున్నారు.