కృష్ణ

కలుషితాహారం తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, ఏప్రిల్ 20: కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. బుధవారం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయుల పనితీరుపై తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని కొర్లకుంటలోని ఎంపియుపి పాఠశాలలో సుమారు 120 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్న ఈ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులకు పాఠశాల నుండి ఇంటికి వెళ్లిన 4 గంటల తరువాత వాంతులు మొదలయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పనులకు వెళ్లి వచ్చేసరికి పిల్లలు వాంతులు చేసుకోవడం చూసి భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక సర్పంచ్‌కు సమాచారం అందించడంతో ఆయన ముసునూరు పిహెచ్‌సికి సమాచారమిచ్చారు. పిహెచ్‌సి సిబ్బంది వచ్చి విద్యార్థులను పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం 20 మందిలో ఏడుగురు విద్యార్థులు మాగంటి రాజేష్, సామియేలు, హరీశ్వరరావు, లక్ష్మీనారాయణ, శివకుమార్, ఆకాంక్ష, మృదులను పిహెచ్‌సికి తరలించి వైద్యసేవలు అందించారు. మిగిలిన వారికి గ్రామంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స జరిపారు. రాత్రంతా ఈ ఏడుగురు విద్యార్థులకు పిహెచ్‌సిలోనే ఉంచి వైద్యసేవలు అందించి బుధవారం ఉదయానే్న ఇంటికి పంపేశారు. జరిగిన సంఘటనపై తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని ప్రశ్నించగా సరైన సమాధానం లభించలేదు. ఇక్కడ అంతా సక్రమంగానే వంటలు చేస్తున్నారని, మీ పిల్లలే ఇంటి వద్ద తిన్న ఆహారంలో తేడా వచ్చి ఉంటుందని ఆమె నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు వారు విలేఖరులకు చెప్పి వాపోయారు. గతంలో కూడా బొద్దింకలున్న సాంబారు, సగం ఉడికిన కోడిగుడ్డుతో పిల్లలకు భోజనం పెట్టిన సంఘటన తమ దృష్టికి వచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. అయితే మంగళవారం వండిన కూరలో కుక్క మూత్రం పోయటం చూసిన విద్యార్థులు ఆ విషయాన్ని చెప్పేలోపే ఈ 20 మంది భోజనం చేసినట్లు కొందరు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండటం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటపై ముసునూరు పిహెచ్‌సి సిబ్బందిని వివరణ కోరగా.. అరటి కూర తినటంతో విద్యార్థులకు గ్యాస్ సమస్య వచ్చి వాంతులై ఉంటాయని అన్నారు. అంతేకాని కలుషిత ఆహారం వల్ల కాదని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనప్పటికీ కలుషిత ఆహారం తిన్న 20 మంది విద్యార్థులు ప్రాణాపాయం నుండి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.