కృష్ణ

జీవనోపాధికై మరోసారి జెసిని కలిసిన సత్యంబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 15: అయేషా మీరా హత్య కేసులో అకారణంగా సుమారు ఎనిమిది సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించి హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటకు వచ్చిన పిడతల సత్యంబాబు తనకు జీవనోపాధి కల్పించాలని మరోసారి జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడుని కలిశారు. జైలు నుండి విడుదలైన తర్వాత గతంలో ఒకసారి అప్పటి కలెక్టర్ బాబు.ఎను కలిసి తనకు జీవనోపాధి కల్పించాలని, ఏ ఆధారం లేని తనకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు పక్కా గృహం, వ్యవసాయ భూమిని కేటాయించాలని వినతిపత్రం అందచేసిన సంగతి తెలిసిందే. అలాగే నర్సింగ్ చదివిన తన చెల్లికి కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. దీనిపై స్పందించిన అప్పటి కలెక్టర్ పక్కా గృహాన్ని మంజూరు చేస్తామని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరకపోవటంతో ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీకాంతంను కలిసేందుకు గాను సోమవారం కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే కలెక్టర్ లక్ష్మీకాంతం విజయవాడలో సిఎం చంద్రబాబు కార్యక్రమంలో ఉండటంతో మీకోసంలో అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ చంద్రుడిని సత్యంబాబు కలిశాడు. గత కలెక్టర్ హామీ ఇచ్చినా ఇప్పటి వరకు తనకు ఎటువంటి న్యాయం జరగలేదని వినతిపత్రంలో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన జెసి చంద్రుడు నందిగామ తహశీల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జెసిని కలిసిన వారిలో సత్యంబాబుతో పాటు దళిత బహుజన పరిరక్షణ సంఘం ప్రతినిధులు అన్నవరపు నాగేశ్వరరావు, ఎగ్గోని గాంధీ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వం వ్యవసాయ విధానం ప్రకటించాలి
* వైసిపి రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
నాగాయలంక, మే 15: సార్వా సాగు చేపట్టక ముందే ప్రభుత్వం రైతు విధానాన్ని ప్రకటించాలని రాష్ట్ర వైసిపి రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మర్రిపాలెం గ్రామంలో సోమవారం మండల వైసిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సభలో నాగిరెడ్డి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ తరుణంలో రైతులకు కావల్సిన సాగునీరు సకాలంలో అందకపోవటం, తగినంతగా సరఫరా చేయలేని పరిస్థితులు ఏర్పడటం వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన వరి వంగడాలు, క్రిమి సంహారక మందులను 70శాతం సబ్సిడీపై అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా వివిధ రకాల ఎరువులను కూడా సబ్సిడీకి ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటిస్తోందని, ఆ మేరకు ఆచరణలో కూడా వారికి కావల్సిన అవసరాలను తీర్చటంలో సరైన విధానంతో వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా వైసిపి నేత కె నరసింహారావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.