కృష్ణ

మొవ్వ మండల పాఠశాలలు ఆదర్శం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మే 16: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మొవ్వ మండల పాఠశాలలు ఆదర్శప్రాయంగా నిలవాలని సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో 10/10 జిపిఎ సాధించిన నలుగురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు పాఠశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని మంగళవారం మొవ్వ ఎంఆర్‌సి భవనంలో ఎంపిపి కిలారపు మంగమ్మ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు 10జిపిఎ సాధిస్తే ఆ పాఠశాలల అధివృద్ధికి అన్ని లక్షల రూపాయలను సిలికానాంధ్ర వసుధైక కుటుంబం అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. 10 జిపిఎ సాధించిన ఒక్కో విద్యార్థికి 2వేల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని అందచేయనున్నట్లు తెలిపారు. నూరు శాతం ఫలితాల కన్నా 10జిబిలు అధికంగా సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. 10జిపిఎ సాధించిన నలుగురు విద్యార్థులకు రూ.2వేలు వంతున, పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.1000 వంతున 18 మందికి నగదు ప్రోత్సాహకాలను ఆనంద్ అతిథులు ద్వారా అందచేసి తల్లిదండ్రులు, విద్యార్థులను దుశ్శాలువాలు, ప్రశంసాపత్రాలతో అభినందించారు. అనంతరం విద్యార్థులు సాధించిన విజయాల వివరాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డా. ఎం శ్రీనివాసరావు, ఎంపిడిఓ వై పిచ్చిరెడ్డి, తహశీల్దార్ బి రామ్‌నాయక్, ఎంఇఓ తోట వెంకటేశ్వరరావు, సిఆర్‌పిలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసి కమిటీ చైర్మన్లు హాజరయ్యారు.

గ్రామీణ ప్రాంతాభివృద్ధికి రూ. 12893 కోట్లు మంజూరు

ఎ కొండూరు, మే 16: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 12893 కోట్లు మంజూరు చేసినట్లు ఉపాధిహామీ రాష్ట్ర డైరక్టరు వీరంకి వెంకట గురుమూర్తి తెలిపారు. మంగళవారం మండలంలోని కంభంపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పర్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. మంత్రి నారా లోకేష్ గ్రామీణ ప్రాంతాలకు పాధాన్యత కల్పిస్తూ అంతర్గత రహదారులు, పాఠశాలలు, శ్మశానవాటికలు, పంచాయతీ భవనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని, వీటిని సద్వినియోగపర్చుకోవాలని కోరారు. వేసవి కాలంలో ఎండలు తీవ్రరూపం దాల్పడంతో ఉపాధికూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కూలీలు మాట్లాడుతూ పనికి తగిన వేతనాలు ఇవ్వడంలేదని, పే స్లిప్‌లు ఇవ్వడం లేదని, వౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆయన దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన వెంటనే కూలీలు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.