కృష్ణ

పేదల సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 5: పేద వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నవ నిర్మాణ దీక్షా వారోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు లేని సమాజ స్థాపనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56లక్షల మంది మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.3వేల 700 ఉన్న వేతనాన్ని రూ.6వేల 700లకు పెంచామన్నారు. ప్రతి సంవత్సరం రూ.10వేల కోట్లతో బిసి సబ్ ప్లాన్‌ను అమలు చేస్తూ ఆ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. 10లక్షల మందికి ఫీజు రీయంబర్స్‌మెంట్ చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ల ద్వారా ఆ వర్గాల ఆర్థిక అభ్యున్నతికి కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బందరు నియోజకవర్గంలో 22వేల మందికి సామాజిక పెన్షన్లను ప్రతి నెలా అందిస్తున్నామన్నారు. ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేశామన్నారు. 500 మంది బిసిలు, 300 మంది ఎస్‌సి, ఎస్‌టి లబ్ధిదారులకు, 500 మంది కాపులకు స్వయం ఉపాధికి బ్యాంక్ లింకేజీ రుణాలు అందించామన్నారు. సభానంతరం చంద్రన్న బీమా పథకం కింద లబ్ధిదారులకు రూ.5లక్షలు బీమా మంజూరు పత్రాలను మంత్రి రవీంద్ర చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షుడు కుంచే దుర్గా ప్రసాద్ (నాని), టిడిపి నాయకులు గోపిచంద్, ఎంపిడివో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ నారదముని, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు తదితరులు పాల్గొన్నారు.